Pawan Kalyan varahi vehicle: జనసేనాని ప్రచార రథం వారాహి మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల అనంతరం తన మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన నేపధ్యంలో ఈ సారి అభ్యర్ధుల్ని బరిలోకి దించే దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ వారాహి వాహనంతోపాటు రేపు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడ ఉదయం 11 గంటలకు పవన్ కల్యాణ్ చేరుకుని వారాహికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. అక్కడనుండి మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. పవన్ ముందుగా అనుకున్న అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాత్ర అనంతరం పవన్ కల్యాణ్ తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు.
ఛలో కొండగట్టు!!
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన “వారాహి” వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/BtIEPEDX5F
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..