Hyderabad: సాగర తీరంలో ఘనంగా భారతమాత మహా హారతి.. మాతృభాష కళ్లవంటిది.. పరాయి భాష కళ్లద్దాల్లాంటివన్న వెంకయ్యనాయుడు
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతమాత భారీ విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ నేతలు, ప్రజలు. భారతమాత భారీ విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. గత ఐదేళ్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమ ప్రాంగణంలో భారతమాత భారీ విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. త్రివర్ణ పతాక రంగుల్లో భారీగా హాజరైన విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది హుస్సేన్ సాగర్ తీరం. దేశ భక్తిని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బ్రిటీష్‌వాళ్లు మన సంపద దోచుకొని పోయారు.. మన సంస్కృతిని నాశనం చేసి, వారి సంస్కృతి రుద్దేసి వెళ్లిపోయారు.. మాతృభాష కళ్లు లాంటిది, పరాయి భాష కళ్లద్దాల్లాంటివన్నారు వెంకయ్యనాయుడు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. మనమంతా ఒక్కటే అనే భావన ఈ కార్యక్రమం తెలియజేస్తుందని, కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. మరోవైపు భారతమాత హారతి కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మహా హారతి కార్యక్రమం చోటు సంపాదించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..