Patriji Dhyana Maha Yagam: ప్రపంచశాంతి కోసం.. కైలాసగిరిలో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభం.. భారీగా హాజరైన ఋషులు
Patriji Dhyana Maha Yagam: మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌లోని కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభమైంది. ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ 11 రోజుల పత్రిజీ మహాధ్యాన యాగాన్ని గురువారం (డిసెంబర్ 21) నుంచి 31వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది రుషులు, యోగులతో పాటు ధ్యానులు, ప్రముఖులు హాజరయ్యారు.
Patriji Dhyana Maha Yagam: మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌లోని కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభమైంది. ప్రపంచశాంతిని ఆకాంక్షిస్తూ 11 రోజుల పత్రిజీ మహాధ్యాన యాగాన్ని గురువారం (డిసెంబర్ 21) నుంచి 31వరకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది రుషులు, యోగులతో పాటు ధ్యానులు, ప్రముఖులు హాజరయ్యారు. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి PSSM గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ స్పిరిచ్యూల్ అసోసియెట్స్ మూవ్ మెంట్ అధ్వర్యంలో ఏడు లక్షల మందికి అన్నదానం చేసేలా కైలాసగిరిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజే లక్ష మంది ధ్యానుల హాజరయ్యారు. ఆధ్యాత్మికతకు పిరమిడ్ శక్తి జోడించి ధ్యానం చేసేలా రోజంతా స్ఫూర్తి ప్రవచనాలు, ధ్యానం తదితర అంశాలను వివరిస్తున్నారు.
పిరమిడ్ ధ్యాన కేంద్రాలతో ప్రపంచంలో నేటి యువతకు నవయుగ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్ర చిరునామాగా నిలిచిందని పత్రిజీ కుమార్తె పరిమళ పత్రి పేర్కొన్నారు. సుభాష్ పత్రిజీ సంకల్పంతో ధ్యాన విజ్ఞానాన్ని పిరమిడ్ శక్తితో అనుసంధానం చేసి దశదిశలా వ్యాప్తి చేశామని అభిప్రాయపడ్డారు. పత్రిజీ ప్రారంభించిన ధ్యాన, శాకాహార ప్రచారాలు కర్నూలులో ప్రారంభమై విశ్వవ్యాప్తం అయ్యాయని.. దీనితో చాలామంది మనశ్శాంతితో జీవిస్తున్నారని పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
పత్రిజీ మహాయాగానికి వచ్చే వాళ్లందరికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున వాలంటీర్లను నియమించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ పదకొండు రోజులు యువతను, ప్రజలను ఆధ్యాత్మిక ధ్యానం వైపు మళ్లించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.