Telangana: ఆటోలో గోల్డ్ బ్యాగ్ వదిలేసిన ప్యాసింజర్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఆటో ఓ వ్యక్తి తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు వచ్చింది.. డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి.. దిగిపోయాడు. ఇంటి లోపలికి ఇలా అడుగుపెట్టాడో లేదో.. ఆటోలో బ్యాగ్ మర్చిపోయానని గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే అటో లేదు. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది.

Telangana: ఆటోలో గోల్డ్ బ్యాగ్ వదిలేసిన ప్యాసింజర్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Auto Driver

Edited By:

Updated on: Dec 24, 2025 | 11:17 AM

శభాష్ చాదర్‌ఘాట్ పోలీసులు! ఆటోలో మర్చిపోయిన విలువైన హ్యాండ్‌బ్యాగ్‌ను తిరిగి యజమానికి అప్పగించారు పోలీస్‌లు. హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో పోలీసులు తమ సేవా మనసుతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. స్థానికుడు మహ్మద్ మజీద్ ఖాన్ ఆటోలో ప్రయాణిస్తుండగా అనుకోకుండా తన విలువైన హ్యాండ్‌బ్యాగ్‌ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగ్‌లో రెండు బంగారు గాజులు, ఒక తులం బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదు ఉండగా.. అతడు వెంటనే చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైమ్ టీం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేగంగా దర్యాప్తు చేసి, ఆటోను గుర్తించి, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుంది. తర్వాత ఇన్‌స్పెక్టర్ కె.బి. మురారి ఆధ్వర్యంలో ఆ వస్తువులను మజీద్ ఖాన్‌కు సురక్షితంగా అప్పగించారు.

పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాలను చూశాం. పట్టుకున్న రికవరీ సొమ్ముని పోలీసులు తమ సొంత అవసరాలకు ఖర్చు పెట్టుకుని బెట్టింగ్‌లో తగబెట్టిన పోలీసుల్ని చూసాము. అదే పోలీసు శాఖలో మంచి మనసున్న పోలీసులు ఉన్న ఉదంతాలు చూసాము. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే చెప్పులురిగేలా తమ చుట్టూ తిప్పించుకున్న పోలీసులు చూశాం. మరోపక్క కంప్లైంట్ వచ్చిన వెంటనే బాధితులను ఆదుకునే విధంగా రెస్పాండ్ అయ్యే పోలీసుల్ని చూశాం. ఏది ఏమైనా నేరం జరిగినప్పుడు వెంటనే స్పందించగల టెక్నాలజీతో పోలీస్ శాఖ ముందడుగు వేస్తోంది. ఆటోలో బంగారం పోగొట్టుకున్న బాధితుడికి సీసీ కెమెరాల ఆధారంగా ఆటోని ట్రేస్ చేసి గంటల వ్యవధిలోనే తిరిగి తన వస్తువులను తనకు అప్పగించారు చాదర్‌ఘాట్ పోలీసులు.