జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్ట వద్ద సందడి నెలకొంది. కురుస్తున్న భారీ వర్షాలకు గుట్టలపై నుండి వరద జలపాతంలా కిందికి దూకుతుంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాండవుల గుట్ట పై నుండి పడుతున్న నీటిలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పాండవులు అరణ్యవాస సమయంలో కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నట్టు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.
ఇక్కడ కుంతీదేవి ఆలయం, భీముడు నిర్మించినట్టుగా చెబుతారు. కొన్నిశిధిల నిర్మాణాలు, ధర్మరాజు పాదాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుట్టపై ఒక ప్రత్యేకమైన బండరాయి ఒకటి దర్శనమిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..