
Palair Assembly Election Result 2023 Live Counting Updates: పాలేరు ఫలితం వచ్చేసింది. పొంగులేటి పాలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా పాతారు. సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై 52,207ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలేరు భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
పాలేరు నియోజకవర్గం (జనరల్).. ఖమ్మం జిల్లాలో పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొదటి నుంచి కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. ఇప్పటివరకు కాంగ్రెస్ (3), కాంగ్రెస్ ఐ(8) 11 సార్లు విజయం సాధించాయి. సీపీఎం 2సార్లు, సీపీఐ ఒకసారి, బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ సీటును జనరల్‌కు కేటాయించారు. 2018లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్థి, అప్పటి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాదించారు. అంతకుముందు రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల భారీ మెజార్టీతో గెలుపొంది.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఉపేందర్ రెడ్డికి 7669 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఉపేందర్ రెడ్డికి 89407 ఓట్లు రాగా, తుమ్మల నాగేశ్వరరావుకు 81738 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల తర్వాత ఉపేందర్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో కందాల కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి చేతిలో ఓడిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్