Chinna Jeeyar Swamy: పద్మ అవార్డు అందుకుని మొదటిసారిగా హైదరాబాద్‌కి వచ్చిన చిన్న జీయర్ స్వామి.. భక్తుల ఘన స్వాగతం

|

Apr 19, 2023 | 6:46 AM

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అక్కడ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు రెండు వారాలపాటు పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంటున్నపద్మభూషణ్ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారికి భక్తులు స్వాగత కార్యక్రమాన్ని  అత్యంత భక్తితో ఘనంగా ఏర్పాటు చేసారు.

Chinna Jeeyar Swamy: పద్మ అవార్డు అందుకుని మొదటిసారిగా హైదరాబాద్‌కి వచ్చిన చిన్న జీయర్ స్వామి.. భక్తుల ఘన స్వాగతం
Chinna Jeeyar Swamy
Follow us on

రామామలు కీర్తి వర్ధనా! పద్మభూషణా! జయహే ! మహజనీ మేన గతస్సప౦ధాః అని ఆర్యోక్తి .. ఎవరు సామాన్య వ్యక్తి స్థాయినుంచి ఆచార్య కృపతో తామూ ఆచార్యులై పరమాచార్యులై కొన్ని కలలపాటు లోకనికి ఆచరించదగిన మార్గాన్ని చూపిస్తారో వారే మహజనులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు.. భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు అందుకుని మొదటిసారిగా హైదరాబాద్ తిరిగివస్తున్న సందర్భంగా చిన్న జీయర్ స్వామి వారి భక్తులు , శ్రీవైష్ణవ ఆరాధకులు , వికాసతరంగిణి సభ్యులు, చిన్న జీయర్ ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున ఘన స్వాగత, భక్తి నిర్వేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఆస్ట్రేలియా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చిన్న జీయర్ స్వామి వారికి భక్తులు అడుగడుగునా భక్తితో స్వాగతం పలికారు.

మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అంటూ ప్రబోధించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు భారత ప్రభుత్వ ప్రకటించిన నుంచి పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి అవార్డు అందుకున్నారు. ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అక్కడ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు రెండు వారాలపాటు పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న పద్మభూషణ్ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారికి భక్తులు స్వాగత కార్యక్రమాన్ని  అత్యంత భక్తితో ఘనంగా ఏర్పాటు చేసారు.

సామాన్య మానవులు చేయలేని పనులను ధృడమైన, అకుంఠిత దీక్షతో, భగవత్ సంకల్పంతో, అవలీలగా చేస్తున్నారు.. ధర్మరక్షణ ఊపిరిగా జీవిస్తున్నారు పద్మభూషణ్ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకోవడం మాపై మరింత బాధ్యత పెంచిందని.. మాతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డులో భాగస్వామ్యం ఉందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు..

ఇవి కూడా చదవండి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముచ్చింతల్ శ్రీరామనగరం వరకు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు . ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకున్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి వారితో పాటు మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా చేరుకున్న శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు నేరుగాబాలమ్మ గార్డెన్స్ లోని మాతృమూర్తి చిలకమర్రి అలుమేలు మంగతా యారు విగ్రహానికి మాతృమూర్తి వందనం చేసారు.

అనంతరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న జాతీయ జెండా స్థలం వద్ద మాతృదేశానికి వందనం చేసారు. పక్కనే ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలోని ధ్వజ స్థంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేసారు.

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతామూర్తి కేంద్రం వద్ద పద్మభూషణ్ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి వారి రాకతో పులకించిపోయారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణతో గజ మాలతో జీయర్ స్వామిని సత్కరించారు. దీపావళి పండగ వచ్చిందన్నట్లుగా టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారికి భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు రావడం పై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని మరో అద్భుత కట్టడం దివ్యసాకేతంకు చేరుకుని అనంత భక్త జనుల మధ్య సాకేత రామాలయం ముందు ఉన్న శ్రీ భగవత్ రామానుజుల విగ్రహానికి పూలమాల సమర్పించారు శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి వారు. జై శ్రీమన్నారాయణ అంటూ భక్తుల నామస్మరణ మధ్య చిన్న జీయర్‌స్వామి వారు భక్తులనుద్దేశించి మాట్లాడారు…

Reporter : Anil

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..