తెలంగాణ గుస్సాడీ కళకు జాతీయ గుర్తింపు.. గిరిజన ముద్దుబిడ్డకు పద్మ అవార్డు ప్రకటన

| Edited By: Ravi Kiran

Jan 29, 2021 | 1:08 PM

దశాబ్దాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో గిరిజనుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

తెలంగాణ గుస్సాడీ కళకు జాతీయ గుర్తింపు.. గిరిజన ముద్దుబిడ్డకు పద్మ అవార్డు ప్రకటన
Follow us on

Padma award winner Artist Kanakaraju : తెలంగాణ ఆదివాసీ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. కొమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం వరించింది. దశాబ్దాలుగా ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీకి ప్రాణం పోస్తున్న కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయిలో అర్థరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం పద్మా పురస్కారాలను ప్రకటించడం… కళల కోటాలో కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో మర్లవాయి మురిసిపోతుంది.

కుమురం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన జైసూర్ మండలం మర్లవాయి గ్రామానికి కనకరాజు తల్లిదండ్రులు రాము, రాజుబాయి. కనకరాజుకు ఇద్దరు భార్యలు, 11 మంది సంతానం. మగపిల్లలు ముగ్గురు కాగా, ఆడ పిల్లలు ఎనిమిది మంది. ఆదివాసీల అరుదైన కళ గుస్సాడీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జీవన సంస్కృతులు ప్రతిభించేలా ఆయన ప్రచారం చేశారు. అంతరిస్తున్న కళను కాపాడుకుంటూ వచ్చారు కనకరాజు.

కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల కనకరాజుకు సన్మానం చేశారు. పద్మశ్రీ అవార్డు రావడంతో మర్లవాయి గ్రామస్తులుగా గర్వపడుతున్నామన్నారు. ఇందిరాగాందీ నుండి కేసీఆర్ వరకు మహామహా నేతల సమక్షంలో తమ కళను ఆవిష్కరించానని.. ఎన్నో అవార్డులు అందుకున్నాన్నారు. ప్రస్తుతం పుట్టిన ఊరు మర్లవాయిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని వివరించారు కనకరాజు. తెలంగాణ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక ఆదివాసీ కనకరాజు కావడం మరో విశేషం. మర్లవాయి హైమన్ డార్ప్ దంపతులు నడయాడిన నేల కావడం మరో విశేషం.

Read Also.. కేసీఆర్ పల్లెలను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు.. పల్లె నిద్ర కార్యక్రమంలో మంత్రి సబితా