AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: మా పార్క్ భూమిని కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

ఆదిలాబాద్ లోని బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని పిల్లల పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడంపై 23 మంది పిల్లలు రాసిన లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

Adilabad: మా పార్క్ భూమిని కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ
Park
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 23, 2024 | 2:50 PM

Share

ఆదిలాబాద్ లోని బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని పిల్లల పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడంపై 23 మంది పిల్లలు రాసిన లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ కమి షనర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బెంచ్ కు నోటీసులు జారీ చేసింది. కబ్జాదారులకు మున్సిపల్ కమిషనర్ శైలజ సలహాలిస్తున్నారని పిల్లలు ఆ లేఖలో పేర్కొ న్నందున ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసింది హైకోర్ట్. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, 1970లో ఆదిలాబాద్ బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటైన హౌసింగ్ బోర్డు కాలనీలో 1 ఎకరం పిల్లల పార్క్ కోసం కేటాయించారు. ఆ భూమిలో 30 గుంటల స్థలాన్ని 2000-2004 కాలంలో కొందరు ఆక్రమించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయాయి. పార్కు భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను నివారించాలని కోరుతూ కాలనీ పెద్దలతో పాటు పిల్లలు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 23 మంది పిల్లలు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించి విచారణ ప్రారంభించింది. పార్క్ స్థలంలో నిర్మాణం అవుతున్న ఆలయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు కబ్జా కు గురైన స్థలంలో నోటీసులు అంటించి ఆలయ నిర్మాణ పనులను నిలిపి వేశారు‌.

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!