Nagarjuna Sagar: నాగార్జున సాగర్ జలాల్లోకి వచ్చి చేరిన వింత జంతువులు.. ఎగబడి చూస్తున్న సందర్శకులు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి.
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో దర్శనమిచ్చాయి. వాటర్ డాగ్స్ కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు
సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అరుదుగా కనిపించే వాటర్ డాగ్స్ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో సందడి చేశాయి. జలాశయంలో నీటి కుక్కలు కలియతిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. సాగర్ లోని పైలాన్ కాలనీ లో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వంతెన సమీపంలో ఆంజనేయస్వామి పుష్కర ఘాట్ వద్ద నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఫొటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అటు భూమి మీద ఇటు నీటిలో ఉండగలిగే ఉభయ చరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. రెండేళ్ళ క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్ లో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలోనే నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ వాటర్ డాగ్స్ చూసేందుకు ముంగిస లాంటి తల, మెడ చూస్తే సీల్ చేప గుర్తొస్తుంది. ఇదో రకమైన క్షీరదం. దీనికి శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరుల ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇవీ సరిసృపాలు.. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటికుక్కలకు చెందిన 13 జాతులు, 7 ప్రజాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయితే, అంతరించిపోతున్న జంతు జాతుల్లో నీటి కుక్కలు కూడా ఉన్నాయనీ, కొంతకాలంగా వీటి సంఖ్య వేగంగా తగ్గిపోతోందనీ జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటికుక్కల ఉనికిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఉప్పల పాడు పక్షుల కేంద్రంలో నీటికుక్కలను గుర్తించగా తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..