Online Classes: మరి కొద్దిగంటల్లో బడి గంటలు మోగనున్నాయి. కరోనా నేపథ్యంలో సెలవలు ప్రకటించి..తిరిగి రాష్ట్రంలోని పాఠశాలలను ఫిబ్రవరి 1నుంచి పునఃప్రారంభానికి సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు విద్య సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. సంక్రాంతి పండగ అనంతరం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సేవలను ప్రభుత్వం పొడిగించింది. దాంతోపాటు ఆన్ లైన్ క్లాసులకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం.ఇక ఇప్పుడు పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఆన్ లైన్ క్లాస్ లను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలు తిరిగి ప్రారంభంకావాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గారు ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఉస్మానియా యూనివర్సిటీ. . తొలుత కోవిడ్ నేపథ్యంలో ఫిబ్రవరి 12వరకు ఆన్ లైన్ క్లాసులు అంటూ ప్రకటించారు. ఫిబ్రవర్ 12 వరకు యూజీ, పీజీ అన్ని సెమిస్టకర్లకి ఆన్‌లైన్ పాఠాలు కొనసాగించాలని ప్రకటన జారీ చేశారు. కానీ రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ వెనక్కి తగ్గింది.