Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?

|

Feb 15, 2022 | 1:40 PM

కంటికి రెప్పాలా కాపాడాడు. తన 14ఏళ్ల నిరీక్షణకు పూలు పూసాయి. కాయలు కాసాయి. రుద్రాక్ష చెట్టును చూడటమే అరుదని.. అలాంటిది కాయలు కాయడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు రైతు లక్ష్మయ్య. దేవుడి మహిమతోనే..

Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?
Rudraksha Tree
Follow us on

తెలుగు కవి భర్తృహరి సుభాషితాల్లో చెప్పినట్లు ప్రయత్నం చేస్తే ఇసుక నుంచి తైలం తీయవచ్చు. ఎండమావిలో నీరు త్రాగవచ్చు. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైన సాధింపవచ్చు అనే నానుడిని నిజం చేసి చూపాడు ఓ రైతు. కేవలం హిమాలయాల్లోనే పెరిగే రుద్రక్ష చెట్లను.. తాను పెంచాలని ఛాలెంజ్ గా తీసున్నాడు. పెంచి, పండించాడు. అసాధ్యం అన్నిది సుసాధ్యం చేసి చూపాడు. కరీంనగర్ జిల్లా(Karimnagar Dist) గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ లక్ష్మయ్య 14ఏళ్ల క్రితం తన పొలంలో పండ్ల మొక్కలతో పాటు రెండు రుద్రాక్ష చెట్లను(Rudraksha Tree) నాటాడు. కేవలం సేంద్రియ ఎరువులతోనే వాటిని పెంచాడు.

కంటికి రెప్పాలా కాపాడాడు. తన 14ఏళ్ల నిరీక్షణకు పూలు పూసాయి. కాయలు కాసాయి. రుద్రాక్ష చెట్టును చూడటమే అరుదని.. అలాంటిది కాయలు కాయడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు రైతు లక్ష్మయ్య. దేవుడి మహిమతోనే రుద్రాక్షలు పండాయంటూ సంతోషం వ్యక్తం చేశాడు లక్ష్మయ్య.

చుట్టూ కొండలు, దగ్గరలో చెరువు ఉండడంతో తోట ప్రాంతం మొత్తం చల్లటి వాతావరం ఉంటుందని అందుకే రుద్రక్షలు పండాయని చెప్పాడు రైతు లక్ష్మయ్య. గత ఏడాది పెద్ద ఎత్తున పూత పూచిన నిలబడలేదని.. ఈఏడాది తాను పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని చెప్పాడు రైతు.

అరుదైన రుద్రాక్ష చెట్లను చూసేందుకు గ్రామస్థులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు లక్ష్మయ్య తోటకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేవుడి మహిమతోనే రుద్రక్షలు పండాయిని.. చెట్లకు పూజలు చేస్తున్నారు స్థానికులు. రుద్రాక్షలు తెంపుకొని దేవుని బహుమతిగా స్వీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..

Skin Care Tips: బాదం నూనె ఉపయోగిస్తే నిత్య యవ్వనం.. ముడుతలు లేని మెరిసే చ‌ర్మం మీసొంతం!