Medaram Maha Jatara 2022: మేడారం జాతరలో ప్రతీది అద్భుతమే! మహిమాన్వితమే! మార్మికమే!

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల వద్ద జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు..

Medaram Maha Jatara 2022:  మేడారం జాతరలో ప్రతీది అద్భుతమే! మహిమాన్వితమే! మార్మికమే!
Sammakka
Follow us

|

Updated on: Feb 15, 2022 | 1:27 PM

Medaram Maha Jatara 2022: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అడుగడుగునా అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. గద్దెల వద్ద జువ్విచెట్టు, చిలకలగుట్ట సమీపంలో తేనెతుట్టలు, సన్నని నీటిధారలు, సమ్మక్క రాకకు ముందు పూజారుల చేతుల్లో వెలుగురేఖలు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాతరలో ప్రతి ఒక్కటీ అద్భుతమే. మాఘశుద్ధ పౌర్ణమికి సమ్మక్క జాతర జరగాలని ఎప్పటినుంచో సంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం బుధవారం నుంచి జాతరను మొదలవుతుంది. పున్నమ వెలుగుల్లో గిరిదేవతల కాంతులు వికసిస్తాయి. ఇక సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు.

సమ్మక్క కుంకుమభరిణె ఉండే ప్రాంతం చిలుకలగుట్ట. అత్యంత మహిమాన్వితమైనదిగా భావించే ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. మరోవైపు చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మల జలధారలుగా చెప్పే ఈ నీటిని తాగితే సమస్తరోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకొనిరావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు. జాతరలో అత్యంత ముఖ్యమైనది మూడోరోజే.. ఆ ఒక్క రోజే 50 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకుంటారు.. మొక్కుబడులు..ఎదురుకోళ్లు.. పొర్లుదండాలు.. జంతుబలులు.. శివసత్తుల పూనకాలతో అడవంతా హోరెత్తిపోతుంది.. జాతరకు వచ్చే భక్తులు తమ ఇలవేల్పులను వారి వారి పద్ధుతుల్లో కొలుస్తుంటారు.. తమ ఈతిబాధలు తీర్చాలంటూ వనదేవతలను ఒక్కొక్కరు.. ఒక్కో పూజావిధానంతో వేడుకుంటారు.

Read Also….  Medaram Jatara 2022: ఒక్కో రోజు.. ఒక్కో ఘట్టం అటవీప్రాంతంలో భక్తుల సంబురం

Medaram Jatara History: సమ్మక్క సారలమ్మల జాతర ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలయ్యింది?

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది