Operation Gaja: ఆపరేషన్ గజ సక్సెస్.. డ్రోన్ కెమెరాలతో ఏనుగు గుర్తింపు.. అధికారులతోపాటు టీవీ9 బృందం అన్వేషణ
కొమురంభీం జిల్లాలో ఆపరేషన్ గజ సక్సెస్ అయింది. థర్మల్ డ్రోన్ కెమెరాలు.. 120మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు ఆపరేషన్ గజలో ఏనుగును గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఆపరేషన్ గజలో టీవీ9 బృందం సైతం పాల్గొంది.
కొమురంభీం జిల్లాలో ఆపరేషన్ గజ సక్సెస్ అయింది. థర్మల్ డ్రోన్ కెమెరాలు.. 120మంది సిబ్బంది నిర్విరామంగా చేసిన కృషి ఫలించింది. ఎట్టకేలకు ఆపరేషన్ గజలో ఏనుగును గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఆపరేషన్ గజలో టీవీ9 బృందం సైతం పాల్గొంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులను చంపి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఒంటరి ఏనుగు జాడ దొరికింది. ఆపరేషన్ గజ పేరుతో గాలింపు చేపట్టిన అటవీ అధికారులు ఏనుగు కనిపించింది. దాంతో.. ఆ ఏనుగును మహారాష్టలోని గడ్చిరోలి వైపు సురక్షితంగా వెళ్లేలా అధికారులు ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి ఏడు గంటలకు ఓసారి.. పదకొండు గంటలకు మరోసారి రోడ్డుపైకి వచ్చింది ఏనుగు. సులుగుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకి అడ్డొచ్చింది. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వాళ్లిచ్చిన సమాచారంతో ఆపరేషన్ గజ మరింత వేగవంతం చేశారు అధికారులు.
120 మంది సిబ్బంది, నాలుగు డ్రోన్ కెమెరాలు.. రెండు థర్మల్ డ్రోన్ కెమెరాలతో అటవీ సిబ్బంది మినిట్ టు మినిట్ ట్రాకింగ్ చేశారు. దాంతో పెంచికల్‌పేట మండలం కమ్మర్గం- మొర్గిగూడ మధ్యలో ఓ కొండపై ఏనుగును గుర్తించారు. మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా రెండు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ గజలో అధికారులతో పాటు టీవీ9 బృందం కూడా పాల్గొంది. ఈ క్రమంలోనే.. ఒంటరి ఏనుగు టీవీ9 కెమెరాకు చిక్కింది.
ఇక, ఈ ఏనుగు 23 ఏనుగుల గుంపు నుంచి తప్పించుకుంది. 30 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న ఈ ఏనుగు, ఒడిశా నుంచి చత్తీస్‌గడ్ మీదుగా మహారాష్ట్ర గడ్చిరోలికి.. ఆ తర్వాత.. ప్రాణహిత సరిహద్దు దాటి కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్ కారిడార్‌కు చేరుకున్నట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఒడిశాలో పుట్టిన ఈ ఏనుగు చాలా ప్రమాదకరమైనదని అటవీ అధికారులు చెబుతున్నారు. నాలుగైదు ఏళ్లలో 10 మందిని చంపిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఏనుగును గుర్తించిన అధికారులు ఫారెస్ట్ వైపు వెళ్లేలా ప్రయత్నాలు చేయడంతో కాగజ్‌నగర్ పరిసర ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…