AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వివాహ రిజిస్ట్రేషన్లలో సరికొత్త రికార్డ్‌.. గ్రేటర్‌లో ఎన్ని నమోదయ్యాయో తెలుసా?

Hyderabad: సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో చాలా వరకు పెళ్లిళ్లు సంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి. కుటుంబ పెద్దలు, బంధుమిత్రుల..

Hyderabad: వివాహ రిజిస్ట్రేషన్లలో సరికొత్త రికార్డ్‌.. గ్రేటర్‌లో ఎన్ని నమోదయ్యాయో తెలుసా?
Registry Of Marriages
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2021 | 6:42 PM

Share

Hyderabad: సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో చాలా వరకు పెళ్లిళ్లు సంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి. కుటుంబ పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో జంటలు ఒక్కటవుతుంటారు. హిందూ వివాహ చట్టం ప్రకారం వీటికి చట్టబద్ధత ఉన్నప్పటికీ.. ఏదైనా ప్రభుత్వ పథకాలు, వీసా, రిజిస్ట్రేషన్లు, తదితర పనుల కోసం చట్టపరమైన ధృవీకరణ(రిజిస్ట్రేషన్) తప్పనిసరి. మ్యారేజ్ సర్టిఫికెట్ విలువ, దాని అవసరం తెలిసిన చాలా మంది పట్టణ ప్రాంత వాసులు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలోనే.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ వివాహాన్ని చట్టపరంగా ధృవీకరించుకుంటున్నారు. చాలా మంది రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గణాకాంలే దీనిని ధృవీకరిస్తోంది.

రిజిస్టర్ మ్యారేజీల పరంగా ఇప్పటి వరకూ హైదరాబాద్‌ టాప్‌లో ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ రిజిస్టర్ మ్యారేజీల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు గ్రామాల్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వివాహ రిజిస్ట్రేషన్లలో తెలంగాణలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జిల్లా తరువాత స్థానంలో హైదరాబాద్ ఉంది.

Hindu Marriage

Marriage

జిల్లాల పునర్విభజనలో భాగంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చాలా గ్రామాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలిపివేశారు. ఈ జిల్లా పరిధిలోని, ముఖ్యంగా హైదరాబాద్ నగర శివార్లలోని ప్రజలు వివాహ రిజిస్ట్రేషన్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో రికార్డైన పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను గమనిస్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనే ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. 2020 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 97,149 జంటలు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో 12,174 రిజిస్టర్ మ్యారేజీలు రికార్డ్ అయ్యాయి. అయితే, ఈ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు పెరగడానికి కారణం ప్రభుత్వ పథకాలేనని, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకం అని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందాలంటే ప్రభుత్వ అధికారుల ధృవీకరణ తప్పనిసరి. అలాగే.. విదేశాలకు వెళ్లేందుకు, వీసా పొందడానికి, ఇతర రిజిస్ట్రేషన్లకు వివాహ ధృవీకరణ తప్పనిసరి. ఈ కారణంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Marriage

Marriage

గడిచిన ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి) జిల్లాల్లో హిందూ వివాహం చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన వివాహాల వివరాలు ఇలా ఉన్నాయి.. 1. మేడ్చల్ మల్కాజిగిరి – 44,345 2. హైదరాబాద్ – 42,189, 3. రంగారెడ్డి – 36,242 4. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే – 1,22,776 పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి.

Also read:

AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

Kohli vs Root: లార్డ్స్ లాంగ్‌రూమ్‌లో కోహ్లీ, రూట్‌ వాగ్వాదం.. తోడైన టీం ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే..?

Andhra Pradesh: స్కూల్స్‌లో కరోనా కలకలం.. మరో 26 మంది విద్యార్ధులకు పాజిటివ్ నిర్ధారణ..