Watch: జ్ఞాపకాలుగా మిగిలిపోయాయ్.. KTPS కర్మాగారంలో పాత కూలింగ్‌ టవర్లను ఎలా కూల్చారో తెలుసా..? వీడియో

| Edited By: Shaik Madar Saheb

Aug 05, 2024 | 12:08 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ KTPS కర్మాగారంలో పాత కూలింగ్‌ టవర్లను ఇవాళ కూల్చివేశారు. A, B, Cస్టేషన్‌లలో 680 మెగావాట్లు ఉత్పత్తి చేసే 8 పాత కూలింగ్‌ టవర్లకు కాలం చెల్లింది. 1965-1978 ప్రాంతంలో ఈ టవర్లను నిర్మించారు. సుమారు 50 ఏళ్లపాటు ఇవి సేవలు అందించాయి.

Watch: జ్ఞాపకాలుగా మిగిలిపోయాయ్.. KTPS కర్మాగారంలో పాత కూలింగ్‌ టవర్లను ఎలా కూల్చారో తెలుసా..? వీడియో
Ktps
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ KTPS కర్మాగారంలో పాత కూలింగ్‌ టవర్లను ఇవాళ కూల్చివేశారు. A, B, Cస్టేషన్‌లలో 680 మెగావాట్లు ఉత్పత్తి చేసే 8 పాత కూలింగ్‌ టవర్లకు కాలం చెల్లింది. 1965-1978 ప్రాంతంలో ఈ టవర్లను నిర్మించారు. సుమారు 50 ఏళ్లపాటు ఇవి సేవలు అందించాయి. వీటి సామర్థ్యం తగ్గిపోవడంతో అధికారులు ఇప్పుడు ఈ టవర్లను కూల్చివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి విద్యుత్‌ వెలుగుల్ని పంచడంలో KTPS చాలా కీలకంగా ఉండేది. ప్రస్తుతం కూల్చేస్తున్న టవర్లకు ఆపరేషన్స్‌ అండ్ మెయింటెన్స్‌కి కాలం చెల్లడంతో 8 యూనిట్లకు సంబంధించిన కూలింగ్‌ టవర్లను నేలమట్టం చేశారు. ఈ కూల్చివేత పనులను ముంబైకి చెందిన ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కి అప్పగించారు. కూల్చివేత సమయంలో ప్లాంట్‌నుంచి విద్యుత్‌ సరఫరా చేసే లైన్లన్నీ ఆపేశారు. ముందుగా A స్టేషన్‌లో 4 టవర్లు కూల్చివేశారు. తర్వాత B, C స్టేషన్లలో మిగతా 4 టవర్లను నేలమట్టం చేశారు. దీంతో పాల్వంచకే తలమానికంగా కనిపించే టవర్లు కనుమరుగయ్యాయి.

వీడియో చూడండి..

జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కూలింగ్ టవర్ల కూల్చివేతకు ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో గతంలో అనుమతులు పెండింగ్ లో పడ్డాయి. కర్మాగారంలోని అత్యంత ఎత్తయిన ఈ టవర్ల కూల్చివేత మినహా మిగిలిన విభాగాలను ఇప్పటికే నేలమట్టం చేసి, వాటి తుక్కును అధికారులు తరలించేశారు. టవర్లతో పాటు గతంలో నేల మట్టం చేసిన పనులకు సంబంధించి జెన్కో సంస్థ టెండర్లు ఆహ్వానించగా రూ.485 కోట్లకు హెచ్ఎర్ – కమర్షియల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. KTPS పాత ప్లాంట్లో 100, 120 మీటర్ల ఎత్తు లో ఉండే చిమ్నీలను గత ఫిబ్రవరిలోనే నేలమట్టం చేశారు. ఈ నిర్మాణాల కూల్చివేత పనుల దృశ్యాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. పాల్వంచలో కూలింగ్ టవర్లు అత్యంత ఎత్తయినవిగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు, కిన్నెరసానికి వెళ్లే పర్యాటకులు ఈ టవర్లను ఫొటోలు తీసుకుంటూ మురిసిపోతుంటారు. టూరిస్టులు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు..

నోయిడా టవర్లను కూల్చిన టెక్నీషియన్లతోనే..

టవర్ల కూల్చివేత పనులు పూర్తి చేయాలంటే చుట్టూ – ఎక్స్ ప్లోజర్లను పెట్టి పక్కకు పడకుండా ఇంక్లోజన్ పద్ధతిలో కుప్పకూలేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఢిల్లీలోని నోయిడా టవర్లను కూల్చిన టెక్నీషియన్లతోనే HR కమర్షియల్ సంస్థ ఇక్కడ టవర్లను కూల్చివేసింది. 1965 – 67 సంవత్సరాల మధ్య నిర్మించిన KTPS A,B,C స్టేషన్లలో 60 మెగావాట్ల సామర్థ్యం గల 1, 2, 3, 4 యూనిట్లు, 120 మెగావాట్ల సామర్థ్యం గల 5,6,7,8 యూనిట్లు ఏర్పాటు చేశారు.. ఒక్కో స్టేషన్కు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 కూలింగ్ టవర్లు నిర్మించారు. విద్యుత్ ఉత్పిత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించినప్పుడు వచ్చే వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు సహాయపడతాయి.. కాగా.. వాటి కాలం చెల్లడంతో ఇప్పుడు వాటిని కూల్చివేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..