Hyderabad City: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని మలక్‌పేట మార్కెట్ ఆవరణలోని చారిత్రాత్మక మహహిబియ మెన్షన్ పురాతన భవనం కొంత భాగం కూలిపోయింది. ఘటనా సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఎటువంటి ప్రమాణ నష్టం గానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదు. కాగా, రెండు రోజులుగా నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ పురతాన భవనం బాగా తడిచిపోయింది. దాంతో బిల్డింగ్ మొదటి అంతస్థు కొంత భాగం కుప్పకూలిపోయింది.
ఈ పురాతన భవనం అత్యంత ప్రమాదకరంగా ఉందని, దీనిని కూల్చివేయాలని అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి పురాతన భవనాలు ఎప్పుడో కూల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి న్యాయస్థానాలు కూడా గతంలోనే ఆదేశాలు జారీ చేశాయి.. తాజాగా ఈ పురాతన భవనం కుప్పకూలడంతో మరోసారి కోర్టుల ఆదేశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నగరంలోని పురాతన భవనాలను గుర్తించి కూల్చివేయాలని కోర్టులు గతంలోనే ఆదేశాలు జారీ చేశాయి. అయితే, అధికారులు నిర్లక్ష్యం వైఖరిని ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా.. ఈ భవనం కుప్పకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యిందని స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
Building Collapse:
Also read:
80 ఏళ్ల అవ్వ గుడిసెలోకి వచ్చిన వ్యక్తి.. భోజనం చేసి.. చేతిలో కవర్ పెట్టాడు.. ఆశ్చర్యపోయిన బామ్మ.!
Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..