Telangana: ఆ చెట్టుకు డబ్బులు కాశాయ్.. మీరే చూడండి..

ఆ అధికారుల చేసిన వినూత్న ఆలోచనకు ఎమ్మెల్యే ఫిదా అయ్యారు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని..రైతులకు వివరించేందుకు క్రేజీ ఐడియాతో ముందుకు వచ్చారు.

Telangana: ఆ చెట్టుకు డబ్బులు కాశాయ్.. మీరే చూడండి..
Oil Palm Tree

Edited By:

Updated on: Dec 06, 2024 | 1:05 PM

ఎక్కడైనా చెట్టుకు డబ్బులు కాస్తాయా… మరీ విడ్డూరంగా లేదు. అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లోని బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. 119 కోట్ల నిధులతో సత్తుపల్లి చుట్టు పక్కల ప్రాంతంలో రైతులు పండించే పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిల్లో రైతులతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిను ఒక చెట్టు ఆకర్షించింది . రైతులను, ఎమ్మెల్యేలను ఆకర్షించిన చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఆ చెట్టు కొమ్మకు డబ్బులు ఉన్నాయి..! అదేంటి ఆ చెట్టుకు డబ్బులు ఎలా వస్తాయి..? ఆ చెట్టు ఏమైనా డబ్బులు కాస్తున్నాయా అని విచిత్రంగా చూస్తున్నారు.

స్టాల్ లో రైతులను ఆకర్షించేలా..వినూత్నంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ అధికారులు ఆయిల్ ఫామ్ చెట్టుకు డబ్బులను కొమ్మలకు వేలాడదీసారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీపై తీసుకున్న ఆయిల్ ఫామ్ మొక్కలను సాగు చేస్తే…మూడు ఏళ్ళు దాటిన తరువాత నుంచి పామ్ ఆయిల్ గెలల దిగుబడితో లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. ఇలా 30 నుంచి 35 ఏళ్ళు ఆయిల్ ఫామ్ మొక్కలతో అధిక లాభాలు వస్తాయని, దీంతో రైతుకు దండిగా ఆదాయం కనక వర్షంలా వస్తుందని అధికారులు వినూత్నంగా ఆలోచించి స్టాల్‌లో చెట్టుకు డబ్బులు కట్టారు. స్టాల్స్‌ను పరిశీలించేందుకు వచ్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి డబ్బుల చెట్టును చూసి అవాక్కయ్యారు. ఏంటి మీ చెట్లకు డబ్బులు కూడా కాస్తయా అని స్టాల్ ఏర్పాటు చేసిన అధికారులను ప్రశ్నించారు. అందుకు ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోటీశ్వర్లను చేసేందుకు సబ్సిడీపై ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఆదాయం పెరిగి ప్రతి ఏడాది ధన వర్షం కురిసినట్టు.. అధిక లాభాలు వచ్చినట్లు రైతులను ఆకర్షించేలా డబ్బులను చెట్టుకు కట్టామని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయికు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..