TSPSC AEE Answer key 2023: టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలకు జూన్‌ 3 వరకు అవకాశం

|

May 28, 2023 | 9:27 PM

టీఎస్‌పీఎస్సీ మే 8, 9 తేదీల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ (సీబీఆర్‌టీ) విధానంలో పరీక్ష నిర్వహించింది. ఏఈఈ (సివిల్‌)తోపాటు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, వ్యవసాయ అధికారులు, ఇంటర్‌విద్యలో లైబ్రేరియన్‌ పోస్టులకు కూడా..

TSPSC AEE Answer key 2023: టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలకు జూన్‌ 3 వరకు అవకాశం
TSPSC AEE Answer key 2023
Follow us on

టీఎస్‌పీఎస్సీ మే 8, 9 తేదీల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ (సీబీఆర్‌టీ) విధానంలో పరీక్ష నిర్వహించింది. ఏఈఈ (సివిల్‌)తోపాటు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, వ్యవసాయ అధికారులు, ఇంటర్‌విద్యలో లైబ్రేరియన్‌ పోస్టులకు కూడా ఇదే తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని మే 27 విడుదలైన సంగతి తెలిసిందే.

ప్రిలిమినరీ పరీక్షపై అభ్యంతరాలను జూన్‌ 1 నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు (ఇంగ్లిష్‌లో) స్వీకరిస్తామని కమిషన్‌ స్పష్టం చేసింది. ఆ తరువాత వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం తెల్పింది. కేవలం ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఈ-మెయిల్స్‌, రాతపూర్వకంగా వచ్చిన వాటిని పరిగణించబోమని ఈ సందర్భంగా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.