Election Notification: తెలంగాణలో మోగిన ఎన్నకల నగారా.. మార్చి 14న పోలింగ్.. 17న ఫలితాలు..

|

Feb 16, 2021 | 12:29 PM

Election Notification: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువండింది.

Election Notification: తెలంగాణలో మోగిన ఎన్నకల నగారా.. మార్చి 14న పోలింగ్.. 17న ఫలితాలు..
Follow us on

Election Notification: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువండింది. ఈ నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి అయిన ప్రియాంక మంగళవారం విడుదల చేశారు. మార్చి 14వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ఎన్నిక కోసం ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యా్హ్నం 3 గంటల వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నట్లు ఆమె తెలిపారు. ఇక 24వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఇకపోతే మార్చి 17వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, 5.60 లక్షల ఓటర్లు ఉండగా.. పోలింగ్ కోసం 616 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also read:

Electric Bike: విద్యార్థి వయసు 15 ఏళ్లు.. రూ.25 వేలతో ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసి శభాష్‌ అనిపించుకుంటున్నాడు

Ashwin is Chepauk Master: సొంత గడ్డపై అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన.. చెపాక్ మాస్టర్ అంటున్న భార్య ప్రీతి . ఫోటో వైరల్