Black Fungus Guidelines: బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి.. తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

|

May 15, 2021 | 6:21 PM

మాన‌వ‌వాళిపై ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. క‌రోనా క‌ల్లోలం ఆగ‌క‌ముందే బ్లాక్ ఫంగ‌స్ మ‌హ‌మ్మారి జ‌డ‌లు విప్పింది. ఈ క్ర‌మంలో...

Black Fungus Guidelines: బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి.. తెలంగాణ స‌ర్కార్ ఉత్త‌ర్వులు
Black Fungus
Follow us on

మాన‌వ‌వాళిపై ప్ర‌మాద‌క‌ర వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. క‌రోనా క‌ల్లోలం ఆగ‌క‌ముందే బ్లాక్ ఫంగ‌స్ మ‌హ‌మ్మారి జ‌డ‌లు విప్పింది. ఈ క్ర‌మంలో తెలంగాణ స‌ర్కార్ అలర్టైయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు కేసీఆర్ సర్కారు నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిని నోడల్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్ ఫంగస్ సమస్య వస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెల్ల‌డించింది. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్లు డీఎంఈ తెలిపింది. బ్లాక్‌ ఫంగస్ బాధితులకు పూర్తిగా కోఠి ఈఎన్‌టీలో చికిత్స అందించనున్నట్లు తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు వాడే ఔషధాలు సమకూర్చాలని టీఎస్ఎంఐడీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కోవిడ్ చికిత్స పొందుతున్న సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేసింది. షుగర్‌ స్థాయిలను నియంత్రించేందుకు అవసరమైతేనే స్టిరాయిడ్లు వాడాలని సూచించింది.

బ్లాక్ ఫంగ‌స్ బారిన పడి కంటి వైద్యుడి అవసరం ఉంటే గనక అలాంటి రోగుల కోసం సరోజినీదేవి కంటి హాస్పిట‌ల్ స‌ర్వీసెస్ వినియోగించుకోవాలని స‌ర్కార్ సూచించింది. గాంధీ ఆస్పత్రి, సరోజినీదేవి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

Also Read:  పెన్నుతో చెక్ చేసిన ఆక్సిజ‌న్ శాతం చూపిస్తోంది.. అస‌లు ఆక్సీమీట‌ర్లు ప‌నిచేస్తున్నాయా.? నిజ‌మేంటంటే..

 తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్‌ కేసులు.. శ్రీకాకుళం, ఖ‌మ్మం జిల్లాల్లో గుర్తింపు