Liquor: మందుబాబులకు షాక్.. హైదరాబాద్ లో నో ’డోర్’ డెలివరీ
మద్యం వినియోగదారులను ఆకర్షించేందుకు పలు మొబైల్ యాప్ లు, వ్యక్తులు మద్యం డెలివరీ సేవలను అందించేందుకు ముందుకు వస్తుండడంతో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చట్టపరంగా అనుమతి లేని ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అరికట్టేందుకు సన్నద్ధమవుతోంది.

మద్యం వినియోగదారులను ఆకర్షించేందుకు పలు మొబైల్ యాప్ లు, వ్యక్తులు మద్యం డెలివరీ సేవలను అందించేందుకు ముందుకు వస్తుండడంతో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చట్టపరంగా అనుమతి లేని ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అరికట్టేందుకు సన్నద్ధమవుతోంది. మద్యం హోమ్ డెలివరీ చేయడం చట్టవిరుద్ధమే అయినప్పటికీ, సాధారణ వైన్ షాపులను మూసివేసిన తరువాత రాత్రి సమయాల్లో ఈ వ్యాపారం పెరిగింది. జనవరి 25 తర్వాత మద్యం హోమ్ డెలివరీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషన్ కమిషనర్ ఇ.శ్రీధర్ మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టం, నిబంధనలను ఉల్లంఘించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం డోర్ డెలివరీ చేయాలంటే చట్టపరమైన అనుమతి ఇస్తూ కొత్త చట్టం తీసుకురావాలి. ఎవరైనా మద్యం డోర్ డెలివరీకి పాల్పడితే చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కమిషనర్ పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించాలని యోచిస్తున్నప్పటికీ, దాని ప్రత్యేక కార్యాచరణ నమూనా కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కస్టమర్ ఆర్డర్ల ఆధారంగా సప్లయర్లు మద్యాన్ని కొనుగోలు చేసి, కొనుగోలుదారుడి పేరు మీద బిల్లులు డ్రా చేస్తారు, ఆ తర్వాత ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీలు రంగంలోకి దిగి మద్యాన్ని డెలివరీ చేస్తాయి.
అయితే మద్యం డోర్ డెలివరీ ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతుంది. దేశ రాజధానిలో కరోనా సమయంలో అక్కడి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి మందబాబుల నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దీని వల్ల డోర్ డెలివరీ చేసే కంపెనీల ఆదాయం కూడా పెరిగింది. అయితే హైదరాబాద్ ఈ తరహా లేనప్పటికీ కొందరు దళారులు మందును తమదైన స్టైల్ లో సప్లయ్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు రావడంతో కీలక నిర్ణయం తీసుకొంది. ఇదిలా ఉండగా ఇటీవల ట్రాఫిక్ పోలీసులకు హైదరాబాద్ పోలీశ్ శాఖ 50 బ్రీత్ ఎనలైజర్ ను పంపిణీ చేసింది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ సంఖ్య పలు ప్రాంతాల్లో పెరిగింది.



