నిజామాబాద్, సెప్టెంబర్ 05: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృ తమైన ఆవర్తనంతో జిల్లాను వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని చెరువులు, కుంటలు నిండాయి. వాగులు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల పంట చేనులకు నీళ్లు చేరాయి. జిల్లా కేంద్రంలోని మాదవనగర్ సాయిబాబా ఆలయానికి కూడ వరద పోటేత్తింది.. భారి వరద రోడ్డు మీద నుండి ఒక్కసారిగా రావడంతో ఆందోళనకు గురయ్యారు భక్తులు… మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో షాక్ కు గురయ్యారు…వెంటనే ఆలయంలోని గద్దే పైకి ఎక్కి వరద తగ్గే వరకు వేచి చూసారు…
నిజామాబాద్ మాదవనగర్ సాయిబాబా ఆలయం పక్కనే మాదవనగర్ రైల్వై బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి… దీంతో అక్కడి నుండి కేనాల్ లోకి వేళ్లాల్సిన నీళ్లు నేరుగా రోడ్డు పైకి వచ్చి దిగువన ఉన్న సాయిబాబా ఆలయంలోకి వరదలాగా ప్రవహించాయి..దీంతో ఆలయం లోపలి బాగంలో మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు…ఆలయ అధికారులు వేంటనే పోలిసులకు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. దర్శనం కోసం వచ్చాం నీళ్లు రావడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు లోపలే ఉన్నామంటూ భక్తులు వాపోయారు.
ఉదయం దర్శనం కోసం వస్తే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడం, నీళ్లు పెద్ద ఏత్తున రావడంతో భయందోళనకు గురయ్యామంటున్నారు భక్తులు.. రోడ్డు పైకి ప్రవాహం స్పీడ్ గా ఉండటంతో ఆలయం లోపలే ఉన్నాం..బయటకు వద్దం అంటే మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి…దీంతో అక్కడే ఏత్తుగా ఉన్న గద్దేల పై ఉన్నామని చేప్పారు…రోడ్డు పై నుండి సాయిబాబా ఆలయం లోపలకి నీళ్లు రావడంతో షాక్ కు గురి చేసింది అన్నారు
భారిగా ట్రాపిక్ జామ్..
ఇక వరద ప్రవాహంతో సాయిబాబా ఆలయం ముందు నుండే నిజామాబాద్ – హైదరాబాద్ హైవే కావడంతో పెద్ద ఎత్తున్న ట్రాపిక్ జామ్ అయింది.. వాహనాలు బురదలో ఇరుక్కు పోయి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు… రైల్వై బ్రిడ్జి పనులు తోందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..