సీనియర్ విద్యార్థుల వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్యాయ్నానికి పాల్పడిన వరంగల్ జిల్లా కేఎంసీ మెడికో పీజీ యూనివర్సిటీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ప్రీతికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం సహకరించడం లేదని చెబుతున్నారు. బీపీ పల్స్ రేట్ నమోదు కానీ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ క్రమంలో ‘ప్రీతికి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలోని ఐదుగురు డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. బుధవారం రాత్రి ప్రీతి టెస్ట్ రిపోర్ట్స్‌ను డాక్టర్ పద్మజ పరిశీలించారు.వరంగల్ నుంచి ప్రీతిని నిమ్స్‌కు తీసుకువచ్చే సమయంలోనే రెండుసార్లు గుండె ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ చేసి గుండె కొట్టుకునేలా చేశారు. అనేస్తేషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, ఇతర డాక్టర్లు ప్రీతికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమి చెప్పలేమ’ని డాక్టర్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది.
హైదరాబాద్‌కు చెందిన ప్రీతి వరంగల్ జిల్లాలోని కేఎంసీలో అనస్తిసి పీజీ చదువుతుంది. అలాగే వరంగల్ ఎంజీఎంలో డాక్టర్‌గా పనిచేస్తోంది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తాళలేక ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. న్యూస్ డైవర్ట్ చేయడానికే వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించినట్లు చెబుతున్నాడు. సైఫ్ కులం పేరుతో దూషించి వేధింపులకు గురి చేశాడని తండ్రి ఆరోపిస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.
అయితే ప్రీతి ఆత్మహత్యాయత్నంపై అంతర్గతంగా విచారణ చేపడుతున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నట్లు తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కారణం ఏంటనేది విచారణలో తెలుస్తుందన్నారు. మూడు మాసాల క్రితమే ప్రీతి తమ కాలేజీలో చేరిందని, వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకుందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనేది విచారణ చేపడతామని చెప్పారు. ప్రీతి వ్యవహారం విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్ ఏమీ జరగలేదని చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..