Hyderabad: పెళ్లై 2 నెలలే.. జస్ట్ ఫోన్ ఇవ్వలేదని బిల్డింగ్ పైనుంచి దూకేసిన నవ వధువు.. కట్ చేస్తే..
యువతలో రోజు రోజుకీ.. సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. ఫోన్లు కారణమవుతున్నాయి. మొబైల్ ఫోన్లు యువతరానికి వ్యసనంగా మారిపోయాయి. ఫోన్ ఇవ్వకపోతే ఎంతకైనా తెగబడే దారుణమైన పరిస్థితులు
యువతలో రోజు రోజుకీ.. సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. ఫోన్లు కారణమవుతున్నాయి. మొబైల్ ఫోన్లు యువతరానికి వ్యసనంగా మారిపోయాయి. ఫోన్ ఇవ్వకపోతే ఎంతకైనా తెగబడే దారుణమైన పరిస్థితులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ జీడిమెట్లలో ఓ నవవధువు మొబైల్ ఫోన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మేడ్చెల్ జిల్లా.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సాయి కాలనీలో ఉదయం 3.30గం.లకు ఓ బిల్డింగ్ రెండో అంతస్తు పైనుంచి దూకి 20 ఏళ్ళ వివాహిత శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలల క్రితమే ఆమెకు వివాహం జరిగింది. పెళ్ళై రెండు నెలలు కూడా కాకుండానే సూసైడ్.. మ్యాటరేంటి అని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఆత్మహత్యకి మొదట.. వ్యక్తిగత వ్యవహారం అనుకున్నారు. తరువాత.. ఇదేదో కుటుంబ తగాదా అయ్యుంటుందని భావించారు అంతా.. కానీ ఆమె తల్లి మాటలు వింటే విషయం వేరే అనేది తేటతెల్లం అవుతుంది.
అవును, అసలు విషయం ఇదేనంటోంది తల్లి. శైలజ ఫోన్‌కి బానిసైపోయింది. యూట్యూబ్‌లో నిత్యం మునిగి ఉండే ఈ నవవధువు చేతిలో ఫోన్ తీసేస్తే భద్రకాళిలా మారుతుంది. లేదంటే సూసైడ్ బెదిరింపులకు దిగుతుంది. కొద్ది రోజుల క్రితం ఫోన్ ఇవ్వకపోతే ఏకంగా కరెంటు తీగలు పట్టేసుకుంది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఫోన్ ఇవ్వనందుకు నానా యాగీ చేసింది. కూతురు ఎక్కడ అన్నంతపనీ చేస్తుందోనని బయలుదేరిన తల్లి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. జరగరాని ఘోరం జరిగిపోయింది.
బయటకు బాగానే ఉన్నా.. ఇంట్లో తరచూ గొడవలయ్యేవి. కారణం ఇంకేముంది మొబైల్ ఫోన్. ఫోన్ ఇవ్వకపోతే ఆమె ప్రాణం పోయినంత పనవుతుంది. ఒక్క క్షణం కూడా ఫోన్ నుంచి ఆమె చూపు మరల్చలేరు ఎవ్వరూ. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఓ విచిత్ర లోకంలో విహరిస్తుండేది ఈ అమ్మాయి. దీంతో కుటుంబంలో తరచూ తగాదాలయ్యేవి. చివరకు ఫోన్ పిచ్చి ఆమె ప్రాణాలు తీసింది. అయితే.. భర్త గంగాప్రసాద్ తన భార్య శైలుని రెండవ అంతస్తు నుండి పడేసాడా.. లేక శైలుది నిజంగానే ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..