AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదలరు..

రోజంతా అలసిపోయి రాత్రి నిద్రలేమితో, అజీర్తితో బాధపడుతున్నారా? అయితే మీకు వంటింట్లోనే ఒక అద్భుతమైన సహజ పరిష్కారం ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి గంట ముందు ఒక గ్లాసు ధనియాల నీరు తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిద్రలోనే కొవ్వును కరిగించే సీక్రెట్.. వంటింట్లో ఉన్న ఈ గింజల మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదలరు..
Coriander Water At Night Benefits
Krishna S
|

Updated on: Aug 17, 2026 | 9:15 PM

Share

భారతీయ వంటకాల్లో ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో ధనియాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో టెర్పెన్లు, క్వెర్సెటిన్, టోకోఫెరోల్స్ వంటి శక్తిమంతమైన ఔషధ సమ్మేళనాలతో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి, కె పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు ధనియాల నీటిని తాగడం వల్ల శరీరానికి లభించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ప్రధానంగా ధనియాల నీరు జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. రాత్రిపూట ఈ నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాత్రంతా జీర్ణక్రియ సజావుగా సాగడం వల్ల ఉదయం లేవగానే కడుపు ఎంతో తేలికగా, హాయిగా అనిపిస్తుంది.

డీటాక్సిఫై – హైడ్రేషన్

ధనియాల నీరు సహజసిద్ధమైన డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని అవయవాల్లో పేరుకుపోయిన హానికర వ్యర్థాలు, విషపదార్థాలను బయటకు పంపి శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరుస్తుంది. అలాగే రాత్రిపూట శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తేమను అందించి ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

వేగంగా బరువు తగ్గడానికి తోడ్పాటు

బరువు తగ్గాలనుకునే వారికి ధనియాల నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ధనియాల్లో ఉండే పోషకాలు శరీర మెటబాలిజం రేటును పెంచుతాయి. రాత్రి నిద్రలో కూడా శరీరం కేలరీలను, అదనపు కొవ్వును కరిగించేలా ప్రేరేపించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణ

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ధనియాల గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అయితే ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్న వారు వైద్యుల సలహా తీసుకుని తాగడం ఉత్తమం.

ఒత్తిడి తగ్గి, ప్రశాంతమైన నిద్ర

ధనియాలలో ఉండే సహజసిద్ధమైన సమ్మేళనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక ఇబ్బందిపడే వారు పడుకునే గంట ముందు ఈ నీటిని తాగితే గాఢమైన, నాణ్యమైన నిద్ర పడుతుంది.

ఎలా తయారు చేసుకోవాలి?

ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ధనియాలను వేసి రాత్రంతా నానబెట్టి లేదా కాసేపు మరిగించి వడకట్టుకోవాలి. ఈ గోరువెచ్చని లేదా సాధారణ నీటిని రాత్రి నిద్రపోవడానికి ఒక గంట ముందు తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం దృఢంగా మారుతుంది.

(గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఇది ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త ఆరోగ్య అలవాటును మొదలుపెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.)

Follow Us