AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బొప్పాయి తోటలోంచి ఏడుపు శబ్ధాలు.. ఏంటని వెళ్లి చూడగా

ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఓ మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోని బొప్పాయి తోటలో వదిలేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును రక్షించి ఆసుపత్రికి తరలించారు.

Telangana: బొప్పాయి తోటలోంచి ఏడుపు శబ్ధాలు.. ఏంటని వెళ్లి చూడగా
Newborn Baby Boy Found Abandoned In Papaya Farm
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 29, 2026 | 10:32 AM

Share

ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న బొప్పాయి తోటలో వదిలేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాపను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ.ఆర్. బంజర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, సమీపంలోని బొప్పాయి తోటలో నుంచి ఏడుపు శబ్దాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చిన వారు తోటలోకి వెళ్లి చూడగా, అక్కడ అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు కనిపించాడు.

శిశువును చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామ ఆశా కార్యకర్తల సహాయంతో శిశువును సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శిశువు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం చిన్నారిని ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, శిశువును దత్తత తీసుకునేందుకు కొందరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, శిశువు తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారు ఎవరనేది గుర్తించిన తర్వాత, చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే, అప్పుడే పుట్టిన శిశువును గ్రామ శివారులోని బొప్పాయి తోటలో ఎవరు వదిలి వెళ్లారు? ఈ ఘటనకు గల కారణాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బొప్పాయి తోటలోంచి ఏడుపు శబ్ధాలు.. ఏంటని వెళ్లి చూడగా
బొప్పాయి తోటలోంచి ఏడుపు శబ్ధాలు.. ఏంటని వెళ్లి చూడగా
FIR నమోదుపై పౌరుడికి ఉన్న రాజ్యాంగ హక్కులేంటి?
FIR నమోదుపై పౌరుడికి ఉన్న రాజ్యాంగ హక్కులేంటి?
ఒకేసారి రూ.5 వేలు డౌన్.. పసిడి ధరల్లో భారీ మార్పులు..
ఒకేసారి రూ.5 వేలు డౌన్.. పసిడి ధరల్లో భారీ మార్పులు..
స్వీట్లు కావు.. రసాయనాలు.. ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే..
స్వీట్లు కావు.. రసాయనాలు.. ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే..
దీపావళి ఖర్చులపై నియంత్రణ ఎలా? ఆర్థిక భద్రత కోసం నిపుణుల సూచనలు!
దీపావళి ఖర్చులపై నియంత్రణ ఎలా? ఆర్థిక భద్రత కోసం నిపుణుల సూచనలు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకోవాల్సిందేనా? రేడియేషన్ థెరపీపై కీలక
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
రామ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పారణ సమయం ఇదే.. ఇలా పూజిస్తే శుభప్రదం!
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..
పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం..