New Year – Drunk and Drive: మరికొన్ని గంటల్లో 2021 ముగిసి.. 2022 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధమయ్యారు. ముఖ్యంగా యువత ఈపాటికే సంబరాలను మొదలు పెట్టేశారు. అయితే, న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మందు బాబులకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సూర్యాస్తమయం అయినా అవలేదు.. పోలీసులు అప్పుడే తమ వేట మొదలు పెట్టేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అనూహ్యంగానే ఉంటాయని ముందు నుంచీ హెచ్చరిస్తున్న పోలీసులు… అంతే అనూహ్యంగా రోడ్లపైకి వచ్చేశారు. ప్రధాన కూడళ్లతోపాటు, కాలనీల్లోనూ, మరికొన్ని వ్యూహాత్మక ఏరియాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేపట్టారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ మూడు కమీషనరేట్ల పరిధిలో 265 టీమ్స్‌తో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్, పబ్‌ల బయట కూడా తనిఖీలు ఉంటాయని పోలీసులు బాంబ్ పేల్చారు. తెల్లవారుజామున 3 గంటల వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తాగిరోడ్‌పైకి వస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు పోలీసులు. పబ్‌లో తాగి పట్టుబడితే పబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు పోలీసులు.
Also read:
Liger: యూట్యూబ్‌లో రౌడీ మేనియా.. రికార్డ్స్ సృష్టిస్తోన్న లైగర్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ముఖంపై ముడతలు రావొద్దంటే రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు..