చట్ట ప్రకారమే రేవంత్ అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన నామా..

చట్టాలు రూపొందించే సభలో.. సభ్యుడిగా ఉండి.. ఆ చట్టాలనే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. రేవంత్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలకు.. టీఆర్ఎస్ ఎంపీ ధీటుగా సమాధానాలిచ్చారు. చట్టం తయారు చేసే వారే.. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని.. ప్రైవేట్ ప్రాపర్టీల వద్ద డ్రోన్‌లు ఎగిరేయడమనేది.. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం నేరమని.. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ప్రదేశంలో.. రేవంత్ అనుచరులు […]

చట్ట ప్రకారమే రేవంత్ అరెస్ట్.. క్లారిటీ ఇచ్చిన నామా..
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 1:28 PM

చట్టాలు రూపొందించే సభలో.. సభ్యుడిగా ఉండి.. ఆ చట్టాలనే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. రేవంత్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలకు.. టీఆర్ఎస్ ఎంపీ ధీటుగా సమాధానాలిచ్చారు. చట్టం తయారు చేసే వారే.. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని.. ప్రైవేట్ ప్రాపర్టీల వద్ద డ్రోన్‌లు ఎగిరేయడమనేది.. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం నేరమని.. మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ప్రదేశంలో.. రేవంత్ అనుచరులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని.. ఇది ఓ వ్యక్తి ప్రైవసీని దెబ్బతీయడమేనన్నారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వ్యక్తి.. సమాచారం మేరకే పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. చట్ట ప్రకారమే పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేశారన్నారు. ప్రస్తుతం ఈ కేసు వ్యవహారం న్యాయస్థానంలో ఉందని.. దీనిపై ఇంతకుమించి మాట్లాడటం సరికాదన్నారు.