
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. అతివేగం, నిద్రమత్తు కారణంగా రోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ తో వెళ్తున్న ఓ డీసీఎం వాహనం మిర్యాలగూడలోని ఈదులగూడ దగ్గరకు రాగానే అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎంలోని ఉన్న టైల్స్ మీదపడి అందులో ఉన్న ముగ్గురు కూలీలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారితో పాటు, మృతదేమాలను వెలికితీసి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మార్చరీకి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డుపై ప్రమాదం ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.