అమెరికాలో దుండగుడి కాల్పులు.. నల్గొండ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

|

Jun 23, 2022 | 7:31 AM

సాయి చరణ్ మరణించిన విషయమై కుటుంబ సభ్యులకు అమెరికా నుండి అధికారులు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అమెరికాలో దుండగుడి కాల్పులు.. నల్గొండ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Nlg Usa Death
Follow us on

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన సాయి చరణ్‌(26) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. మేరీల్యాండ్‌ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయి కిరణ్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. స్నేహితుడిని Airportలో డ్రాప్ చేసి వస్తున్న సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నల్గొండ జిల్లాకు చెందిన సాయి చరణ్‌ మృతి చెందాడు.

రెండేళ్లుగా సాయి చరణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సాయిచరణ్ ప్రయాణీస్తున్న కారుపై దుండగుడు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మరణించారు. సాయి చరణ్ మరణించిన విషయమై కుటుంబ సభ్యులకు అమెరికా నుండి అధికారులు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయి చరణ్ తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడని తెలిసింది. నాలుగేళ్ల క్రితం సాయి చరణ్ అమెరికాకు వెళ్లగా.. ఎంఎస్ పూర్తి చేసిన అనంతరం… మేరీల్యాండ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని సోదరి కూడా అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

అయితే గత కొద్దిరోజులుగా చూస్తే అమెరికాలో లో కాల్పులు విషయంపై తెగ చర్చ నడుస్తోంది. మే నెలలో ఓ పాఠశాలలపై దుండగుడు జరిపిన కాల్పుల్లో… ఏకంగా 21 మంది మృతి చెందారు. ఇందులో 18 మంది చిన్నారులు ఉన్న విషయం తెలిసిందే. గణాంకాలను బట్టి చూస్తే 2020 ఏడాదిలో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది 2019తో పోలిస్తే 35 శాతం అధికమని సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) తాజాగా పేర్కొంది. అయితే ఈ తరహా ఘటనలతో అమెరికాలో మరోసారి గన్‌ కల్చర్‌పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పలు సంఘాలు గన్ లైసెన్స్ ల మంజూరుపై సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.