Telangana: పదో తరగతి విద్యార్థినిలకు కలెక్టర్ బంపర్ ఆఫర్.. మీరు నిజంగా సూపర్ మేడమ్!

. కనగల్‌ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, చదువు పైన ఎక్కువ దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధం ప్రిపేర్ కావాలనుకునే వారు ఇప్పటి నుంచే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలని తెలిపారు.

Telangana: పదో తరగతి విద్యార్థినిలకు కలెక్టర్ బంపర్ ఆఫర్.. మీరు నిజంగా సూపర్ మేడమ్!
Nalgonda District Collector Ila Tripathi

Edited By: Balaraju Goud

Updated on: Feb 13, 2025 | 5:24 PM

సాధారణంగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పలు రకాల ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. ఉత్తమ మార్కులు సాధిస్తే.. విద్యార్థులకు ఇష్టమైన గిఫ్టులు ఇస్తామని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హామీ ఇస్తుంటారు. కానీ ఓ జిల్లా కలెక్టర్ మాత్రం.. పదో తరగతి విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆఫర్ కు సంబంధించి కూడా హామీ పత్రం రాసి ఇచ్చారు. ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఆమె జిల్లా పరిపాలనాధికారి.. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా ఉంటారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మిన అధికారి. ముఖ్యంగా బాలికలకు విద్యా అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తుంటారు. వారిని చదువుల్లో ప్రోత్సహించేందుకు వినూత్నంగా బంపర్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. ఆమె ఎవరో కాదు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిత్యం పర్యటనలతో యంత్రాంగాన్ని హల్చల్ చేస్తుంటారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తుంటారు. కనగల్‌ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో ముచ్చటించి సమస్యలను తెలుసుకున్నారు. వారితో సెల్ఫీ తీసుకున్నారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థినులకు ఆమె బంపర్ ఆఫర్ ప్రకటించారు. పదవ తరగతిలో జిపిఏ 10/10 మార్కులు సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కేవలం నోటి మాటలకే కాకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాతపూర్వకంగా కలెక్టర్ హామీపత్రం ఇచ్చారు. బాలికలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆమె అన్నారు.

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, చదువు పైన ఎక్కువ దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధం ప్రిపేర్ కావాలనుకునే వారు ఇప్పటి నుంచే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలని సూచించారు. 8, 9, 10 తరగతి విద్యార్థినిలు ఇప్పటి నుండే ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రాక్టీస్ చేయాలన్నారు. అవసరమైన స్టడీమెటీరియల్‌ను త్వరలోనే పాఠశాలకు పంపిస్తానని విద్యార్థినులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ మార్కులు సాధిస్తామని విద్యార్థినులు కలెక్టర్ కు చెప్పారు. జిల్లా కలెక్టర్ తమను ప్రోత్సహించడం పట్ల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..