
నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లూరుకుకి చెందిన గణేశ్ అనే యువకుడు గురువారం ఉదయం భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్యాషన్‌ప్లస్ బైక్‌పై కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్తుండగా.. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్ ముందు భాగంలో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానంతో గణేశ్ బైక్‌ను ఆపి చూడగా.. లోపల పాము దాక్కొని ఉండటం చూసి కంగుతిన్నాడు. బైక్ ఆపినా పాము బయటకి రాకపోవడంతో… గణేశ్ పామును తొలగించేందుకు కొద్దిసేపు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోవడంతో దగ్గర్లోని మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లాడు.
మెకానిక్ సద్దాం బైక్‌ను విడదీసి దాదాపు 3.5 ఫీట్లు పొడవైన కట్లపామును బయటకు తీశాడు. రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన సమయంలో పాము బైక్‌లోకి దూరి ఉండొచ్చని గణేశ్ చెప్పాడు. చివరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అతని ఊపిరి పీల్చుకున్నాడు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.