అంబరాన్నంటిన RID ఆత్మీయ సమ్మేళనం.. పిల్లల్లో చదువుతోపాటు సంస్కారం అవసమన్న మై హోమ్ అధినేత జూపల్లి

|

Nov 29, 2024 | 1:49 PM

అపూర్వ సమ్మేళనానికి కొల్లాపూర్‌ వేదిక అయింది. రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్‌ కాలేజీ... స్వర్ణోత్సవాలతో పులకించింది. కొల్లాపూర్‌ను కొహినూర్‌ వజ్రంలా మార్చడమే RID గోల్డెన్‌ జూబ్లీ వేదిక లక్ష్యమన్నారు పూర్వ విద్యార్ధులు.

అంబరాన్నంటిన RID ఆత్మీయ సమ్మేళనం.. పిల్లల్లో చదువుతోపాటు సంస్కారం అవసమన్న మై హోమ్ అధినేత జూపల్లి
Dr Jupalli Rameswara Rao At Panel Discussion In Rid Golden Jubilee Celebrations
Follow us on

కొల్లాపూర్‌ రాణి ఇందిరాదేవీ పాఠశాల.. జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య అంబరాన్నంటుతోంది. చదువు, సంస్కారం నేర్పిన బడిని మరవలేం.. ఆర్‌ఐడీని మరో లెవెల్‌కి తీసుకెళ్తామంటున్నారు పూర్వ విద్యార్థులు. ఇక చివరి రోజు స్వర్ణోత్సవ సంబురాలు.. అంతకుమించి అనేలా ఏర్పాట్లు చేశారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లోని రాణి ఇందిరా దేవి పాఠశాల, జూనియర్ కాలేజీ.. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మురిసిపోతుంది. పాఠశాలలో చదువుకున్న వేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో చివరి రోజైన శుక్రవారం.. మరింత జోష్ నింపే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొల్లాపూర్‌ను కొహినూర్‌ వజ్రంలా మార్చడమే RID గోల్డెన్‌ జూబ్లీ వేదిక లక్ష్యమన్నారు పూర్వ విద్యార్ధులు. ఈ స్వర్ణోత్సవాలు సాకారం కావడానికి కారణమైన మై హోమ్‌ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావును పూర్వ విద్యార్ధులు అభినందించారు. రామేశ్వరరావు చొరవతో RID స్కూల్ ముఖ చిత్రం మారిపోయింది హార్వర్డ్ ప్రొఫెసర్ జయరాం తెలిపారు. RID స్కూల్ అభివృద్ధికి జూపల్లి సహాయం మరువలేనిదని, అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చామని బిట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాం గోపాల్ రావు అన్నారు.

ఇక చివరి రోజు వేడుకలకు మై హోమ్ గ్రూపు అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొల్లాపూర్ విద్యార్థులకు చదువునే చక్కని వాతావరణం కల్పించడమే RID విజన్-2050 లక్ష్యమని జూపల్లి రామేశ్వరరావు అన్నారు. వాతావరణం బాగుంటేనే సమాజం బాగుంటుందన్న ఆయన, కొత్త పద్దతులతో విజన్-2050 ఉంటుందన్నారు. పూర్వ విద్యార్థులు అందరూ 2050 కోసం సహకారం అందిస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. నిష్ణాతుల సలహాలు సూచనలతో మరింత ముందుకు వెళతామన్న జూపల్లి, చదువు తోపాటు సంస్కారం విలువలతో పిల్లలు పెరగాలన్నారు.

ఇక స్వర్ణోత్సవ సంబురాల్లో రెండో రోజు హాజరైన సినీ హీరో విజయ్ దేవరకొండ.. ఆర్‌ఐడీ విజన్‌ 2050 ఏవీని ఆవిష్కరించారు. ఆర్‌ఐడీ నుంచి ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇకపై ప్రతీ ఏటా కొల్లాపూర్‌కి వస్తానని హామీనిచ్చారు విజయ్‌. చివరి రోజు ముగింపు వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. అలాగే, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులతో కలిసి 2K వెల్‌నెస్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత బ్యాచ్‌ల వారీగా పరిచయాలు.. అల్యూమినీతో వేర్వేరు ఇండస్ట్రీస్‌తో ఎంవోయూలు చేపట్టారు. ఆ తర్వాత సక్సెస్‌ స్టోరీస్ థీమ్‌తో ప్యానల్ డిస్కషన్‌.. ఆర్‌ఐడీ అవార్డ్స్ కార్యక్రమం జరుగింది. అనంతరం టీచర్లు, లెక్చరర్ల సన్మానంతో పాటు ర్యాలీ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇక సాయంత్రం మెగా మ్యూజికల్ బ్యాండ్‌, ఆర్కెస్ట్రా గ్రాండ్‌గా నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..