Hyderabad Crime: మాట్లాడుకుందామని పిలిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఆపై

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ(Erragadda) హాస్పిటల్ ఆవరణలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. హాస్పిటల్ మైదానంలో శుక్రవారం రాత్రి సాయికుమార్‌ అనే యువకుడిపై అతని మిత్రులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్...

Hyderabad Crime: మాట్లాడుకుందామని పిలిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఆపై
fire
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 10, 2022 | 10:00 PM

హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ(Erragadda) హాస్పిటల్ ఆవరణలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. హాస్పిటల్ మైదానంలో శుక్రవారం రాత్రి సాయికుమార్‌ అనే యువకుడిపై అతని మిత్రులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్(Hyderabad) నగరంలోని కృష్ణానగర్‌ లో నివాసముండే ఆదిల్ అలియాస్ సాయి కుమార్ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇతనిపై గతంలో మూడు చోరీ కేసులు ఉన్నాయి. గతంలో పోలీసుల విచారణలో అతని స్నేహితుడు మహమ్మద్ మేనల్లుడు సోహైల్‌ పేరును ఆదిల్‌ చెప్పాడు. దీంతో తన మేనల్లుడి పేరును పోలీసులకు ఎందుకు చెప్పావంటూ మహమ్మద్ ఆదిల్ పై కక్ష పెంచుకున్నాడు. ఆదిల్ ను హత్య చేసేందుకు ప్రణాళిక రచించాడు. తన మిత్రుడు అజర్‌తో కలిసి హత్య చేయాలని నిర్ణయించాడు. పథకం ప్రకారం ఆదిల్ ను మాట్లాడుకుందామని పిలిపించాడు. అనంతరం ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ ఆవరణకు తీసుకెళ్లారు. మాట్లాడుతుండగానే ఆదిల్ పై అజర్‌ పెట్రోల్ పోశాడు. మహమ్మద్‌ లైటర్‌తో నిప్పంటించి పారిపోయాడు.

మంటలు తాళలేక హాహాకారాలు చేస్తున్న ఆదిల్‌ను స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పి వేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 50శాతం కాలిన గాయాలతో ఆదిల్ అక్కడ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also  Read

Digital News Round Up: ప్రిన్స్‌ మహేశ్‌ పుత్రికోత్సాహం | కింగ్‌కోబ్రాకు కిస్సులు.. వీడియో

Health Tips: చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించాలంటే ఈ 4 డ్రై ఫ్రూట్స్ డైట్‌లో ఉండాల్సిందే..!

Prabhas: త్వరలోనే నయా లుక్‌లో కనిపించనున్న డార్లింగ్.. మారుతి సినిమాకోసం మరోసారి అలా…