Komatireddy Raj Gopal Reddy: ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. మహిళ సమాధానానికి పగలపడి నవ్విన ఎమ్మెల్యే
మునుగోడులో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించారు. అదే సమయంలో చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్‌కు రావడంతో ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు ఎక్కారు.
మునుగోడులో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్టీసీ బస్ స్టేషన్‌ను సందర్శించారు. అదే సమయంలో చౌటుప్పల్ నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్‌కు రావడంతో ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులోని మహిళలను ఎమ్మెల్యే పలకరించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని సరదాగా ముచ్చటించారు. ఉచిత ప్రయాణం చేసేవాళ్లందరూ దర్జాగా కూర్చుంటున్నామని, టికెట్ తీసుకున్న వాళ్లకు బస్సులో సీటు దొరకడం లేదని ఓ మహిళ చెప్పిన సమాధానంతో బస్సులో ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు.
గతంలో ఓసారి వైన్ షాపులోకి వెళ్లిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం బాటిల్లను పరిశీలించారు. వైన్ షాపుకు ఆనుకుని ఉన్న పర్మిట్ రూములను కూడా పరిశీలించారు. అప్పటికే పర్మిట్ రూమ్స్‌లో కొందరు మద్యం ప్రియులు మద్యం సేవిస్తున్నారు. అక్కడ మద్యం బాబులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. నిత్యం ఏదో వైవిధ్యమైన కార్యక్రమంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు.