Munugode: మునుగోడు ప్రచారానికి రెడీ అంటున్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి..? ప్రియాంకా గాంధీ భేటీలో ఏం చర్చించారు?

|

Aug 26, 2022 | 7:01 AM

Munugode: తెలంగాణలోని హస్తం పార్టీలో రాజకీయాలు సద్దుమణుగుతున్నాయి. ఇటీవల సొంతగూటిలోనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న నేతలు.. వెనక్కి తగ్గి మునుగోడుపై..

Munugode: మునుగోడు ప్రచారానికి రెడీ అంటున్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి..? ప్రియాంకా గాంధీ భేటీలో ఏం చర్చించారు?
Komatireddy Venkat Reddy
Follow us on

Munugode: తెలంగాణలోని హస్తం పార్టీలో రాజకీయాలు సద్దుమణుగుతున్నాయి. ఇటీవల సొంతగూటిలోనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న నేతలు.. వెనక్కి తగ్గి మునుగోడుపై దృష్టి సారిస్తున్నారు. కొందరు సీనియర్‌ నేతలు ఢిల్లీ పయనమై సోనియాగాంధీని కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సవాలుగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు కాకముందే ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే వ్యవహాలు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నిక చుట్టూ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ గాంధీభవన్ నుంచి.. ఢిల్లీ పార్టీ ఆఫీస్ వరకు.. ఈ ఎపిసోడ్ మీద చర్చ నడుస్తోంది. మునుగోడులో కాంగ్రెస్ తరపున ఎవరిని నిలబెట్టాలనే దానితో పాటు ప్రచారానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారా లేదా అనేదానిపై పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. మునుగోడుతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కస్సుబుస్సులాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఢిల్లీలో ప్రియాంకా గాంధీని కలిసిన తర్వాత కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. మునుగోడు ప్రచారానికి వస్తానంటూ.. సీఎల్పీ నేత భట్టికి హామీ ఇచ్చారు. అంతే కాకుండా మునుగోడు అభ్యర్ధి విషయంలోనూ తన సలహాలు ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి.

కాంగ్రెస్‌ ఆశావాహుల మంతనాలు..

ఇవి కూడా చదవండి

మునుగోడులో ఏ క్షణమైనా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆశావాహులు మంతనాలు మొదలెట్టారు. ప్రధానంగా పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో ప్రియాంకాగాంధీ కీలక సమావేశం నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు, టీపీసీసీలో విభేదాలపై తెలంగాణ సహ ఇంచార్జ్‌ల‌తో చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి