Munugode Bypoll: పీక్స్‌కు చేరిన మునుగోడు యుద్ధం.. మంగళవారం ముగియనున్న ప్రచారం..

|

Oct 31, 2022 | 10:59 PM

మునుగోడు యుద్ధం పీక్స్‌కి చేరింది. మంగళవారంతో ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడనుండటంతో.. పొలిటికల్‌ హైటెన్షన్‌ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు మకాం వేసి..

Munugode Bypoll: పీక్స్‌కు చేరిన మునుగోడు యుద్ధం.. మంగళవారం ముగియనున్న ప్రచారం..
Munugode
Follow us on

మునుగోడు యుద్ధం పీక్స్‌కి చేరింది. మంగళవారంతో ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడనుండటంతో.. పొలిటికల్‌ హైటెన్షన్‌ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు మకాం వేసి.. ప్రచార హోరును పెంచారు. అటు.. నేతల మధ్య విమర్శనాస్త్రాలు తీవ్రమయ్యాయి. అటు మోటర్లకు మీటర్లపై టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. కేఏ పాల్‌ ఎప్పట్లాగే తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉపసమరంలో గెలిచేందుకు.. రాజకీయపార్టీలు ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాయి. ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉండటంతో క్యాంపైన్‌ ముమ్మరం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ప్రధానపార్టీలు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నాయి.

మునుగోడులో హారాహోరీ ప్రచారం ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రధాన పార్టీనేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మోటార్లకు మీటర్లు, చేనేతపై జీఎస్టీ, ఫాంహౌస్‌ బేరసారాలపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మోటర్లకు మీటర్లు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు కిషన్‌రెడ్డి. మోటార్లకు మీటర్ల అంశంలో బీజేపీ ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. మోటార్లకు మీటర్లపై కేంద్రం రాసిన లేఖలను చదివి వినిపించారు. అబద్ధాలు చెబుతున్న కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు హరీష్‌రావు.

సుశీ ఇన్‌ఫ్రా అకౌంట్‌ నుంచి బదిలీ అయిన ఐదు కోట్లకుపైగా నగదుతో తనకు సంబంధం లేదన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్‌ ఓడిపోతుందని ఆ పార్టీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారాయన. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జోరుగా ప్రచారం చేపట్టాయి. మునుగోడు, చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్రిగూడెంలో మహిళలతో సమావేశమయ్యారు. పోలింగ్‌పై అవగాహన కల్పించారు.

ఇవి కూడా చదవండి

మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇటు మర్రిగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేపట్టింది. బీజేపీ-టీఆర్‌ఎస్‌లు ఒక్కటై ఫాంహౌస్‌ డ్రామాకు తెరలేపాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. అటు స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ వినూత్న ప్రచారం నిర్వహించారు. పత్తి చేళ్లలో పాల్‌ కూలీలతో కలిసి డ్యాన్స్‌ చేశారు. మొత్తానికి మునుగోడులో ప్రచారానికి కొద్దిగంటలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..