Munugode By Poll Result 2022 Live: మునుగోడు గడ్డపై గులాబీ జెండా.. 11 వేలకు పైగా మెజార్టీతో TRS గెలుపు.. అంబరాన్నంటిన సంబరాలు

| Edited By: Ravi Kiran

Nov 06, 2022 | 6:19 PM

Munugode By Election Result Counting Live Updates: మునుగోడు మొనగాడెవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Munugode By Poll Result 2022 Live: మునుగోడు గడ్డపై గులాబీ జెండా.. 11 వేలకు పైగా మెజార్టీతో TRS గెలుపు.. అంబరాన్నంటిన సంబరాలు
Munugode Results

మునుగోడు మొనగాడెవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు ఇంకాసేపట్లో ప్రారంభంకానుంది. ఇంతకీ, మునుగోడు ఓట్ల లెక్కింపు ఎక్కడ? ఎన్ని రౌండ్లలో జరగనుంది? ఫస్ట్‌ రౌండ్‌ రిజల్ట్‌ ఎప్పుడు రానుంది? వివరాలు తెలుసుకుందాం.. మూడు నెలల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు, పార్టీల భవితవ్యం మరికొన్నిక్షణాల్లో తేలిపోనుంది. నల్గొండ ఆర్జాలబావిలోని స్టేట్‌వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అందుకోసం 21 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. మొదట పోస్టల్‌ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేస్తారు. ఉదయం 9గంటలకల్లా ఫస్ట్‌ రౌండ్‌ రిజల్ట్‌ రానుంది. అంటే, కౌంటింగ్‌ మొదలైన గంటకు మునుగోడు ఓటరు నాడి ఎలాగుందో క్లియర్‌ పిక్చర్‌ వచ్చేయనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మునుగోడు మొనగాడెవరో తేలిపోనుంది. మొదటిగా 686 పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్‌ను ఓపెన్ చేస్తారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ బూత్స్‌ ఓట్లను లెక్కిస్తారు.

మునుగోడు ఓట్ల లెక్కింపులో మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 1,2,3 రౌండ్లలో చౌటుప్పల మండలం లెక్కించనున్నారు. 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 7,8 రౌండ్లలో మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 9,10 రౌండ్లలో చండూరు మండలం, 11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గుట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కించనున్నారు.

గంటకు మూడు నుంచి నాలుగు రౌండ్ల ఫలితాలు రానున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,41,855 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 2,25,192 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు ఢిల్లీ పరిశీలకుల పర్యవేక్షణ.. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, సీసీ కెమెరాల సమక్షంలో టోటల్‌ కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

మునుగోడు ఓట్ల లెక్కింపు లైవ్ కోసం ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Nov 2022 06:15 PM (IST)

    మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు.. మంత్రి కేటీఆర్

    మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు.. మంత్రి కేటీఆర్

    ఎన్ని మాయలు చేసినా మునుగోడు ప్రజలు.. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చింది బీజేపీ నేతలేనంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

  • 06 Nov 2022 05:20 PM (IST)

    మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు..

    హోరాహోరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దాదాపు 11 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందింది. రెండో స్థానంలో బీజేపీ నిలవగా.. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

  • 06 Nov 2022 05:12 PM (IST)

    14వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దే మెజార్టీ..

    మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. 14 రౌండ్లు ముగిసే నాటికి టీఆర్ఎస్ 10128 కి పైగా లీడ్‌లో ఉంది.

  • 06 Nov 2022 05:05 PM (IST)

    13 రౌండ్ల అప్టేడ్స్ ప్రకారం.. అభ్యర్థులకు పోలైన ఓట్లు..

    13 రౌండ్ల అప్టేడ్స్ ప్రకారం.. అభ్యర్థులకు పోలైన ఓట్లు..

    కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 88,708

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – 79,580

    పాల్వాయి స్రవంతి -19,415

    టీఆర్ఎస్ 9136 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 05:01 PM (IST)

    మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుపై.. కేటీఆర్ ప్రెస్ మీట్

    మునుగోడులో టీఆర్ఎస్ పూర్తిస్థాయి ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరికాసేపట్లో మునుగోడు ఫలితం వెలువడనుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. వీక్షించేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 06 Nov 2022 04:47 PM (IST)

    మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న మంత్రి కేటీఆర్

    మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో తెలంగాణ భవన్ సంబరాల్లో మునిగిపోయింది. బాణా సంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.

  • 06 Nov 2022 04:45 PM (IST)

    బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది.. మంత్రి జగదీశ్ రెడ్డి..

    బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది.. మంత్రి జగదీశ్ రెడ్డి..

    మునుగోడు ఫలితంతో రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా హ్యాట్రిక్ సాధించాం

    మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచింది

    ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మునుగోడు ఫలితం నిరూపించింది

    ఓటమిని అంగీకరించకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాకులు వెతుకుతున్నారు

    ఎన్నికల కమిషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ నేతలే.. అంటూ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

  • 06 Nov 2022 04:43 PM (IST)

    టీఆర్ఎస్‌కు 9వేల ఓట్ల ఆధిక్యం..

    టీఆర్ఎస్‌కు 9వేల ఓట్ల ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. 13 రౌండ్లు ముగిసే సమయానికి అధికార టీఆర్ఎస్ 9 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. 13వ రౌండ్లో టీఆర్ఎస్‌కు 6619, బీజేపీకి 5406 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రౌండ్లో టీఆర్ఎస్ 1285 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. మొత్తంగా 9136 ఓట్లతో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 04:34 PM (IST)

    13 రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం..

    13 రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ 9,039 లీడ్‌లో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 04:27 PM (IST)

    కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు..

    మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. 12 రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి 17,627 ఓట్లు వచ్చాయి.

  • 06 Nov 2022 04:17 PM (IST)

    సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న గ్రామాల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ..

    సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న లెంకలపల్లి సారంపేట గ్రామాల్లో టీఆర్ఎస్ కు 700 మెజారిటీ..

    ముఖ్యమంత్రి తరఫున అక్కడ ప్రచార కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్సీ పోచంపల్లి

  • 06 Nov 2022 04:04 PM (IST)

    రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది.. రాజగోపాల్ రెడ్డి

    రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది.. ప్రలోభాలతో గెలిచారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు.. కమ్యూనిస్టులు కేసీఆర్ కు అమ్ముడుపోయారు.. అంటూ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

  • 06 Nov 2022 04:02 PM (IST)

    13వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ దే ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 13 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 13 వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 04:00 PM (IST)

    ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు కౌరవ సైన్యం వచ్చింది..

    గుర్తుల కేటాయింపు నుంచి కూడా దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు కౌరవ సైన్యం వచ్చింది.. టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

  • 06 Nov 2022 03:58 PM (IST)

    నైతికంగా విజయం నాదే.. రాజగోపాల్ రెడ్డి.. 

    నైతికంగా విజయం నాదే.. రాజగోపాల్ రెడ్డి..

    31 వరకు ధర్మం నిలిచింది.. నవంబర్ 1 నుంచి అధర్మం నిలించింది. టీఆర్ఎస్.. మందు, డబ్బుతో అధర్మానికి పాల్పడింది. రిటర్నింగ్ అధికారి కనీసం నిబంధనలు పాటించలేదు. నన్ను మా నేతలను కట్టడి చేశారు. ఈ ఎన్నికల్లో అధర్మం గెలిచింది. నైతికంగా విజయం నాదే.. అంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

  • 06 Nov 2022 03:55 PM (IST)

    ప్రజా తీర్పును గౌరవిస్తున్నా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    ప్రజా తీర్పును గౌరవిస్తున్నా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    మునుగోడులో ప్రజా తీర్పును గౌరవిస్తున్నా..

    కనీసం ప్రచారం చేసుకోనివ్వలేదు.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

    ప్రలోభాలకు గురిచేసి.. కేసీఆర్, కేటీఆర్ అధికారులను ఇబ్బందులకు గురిచేశారు.

     

  • 06 Nov 2022 03:52 PM (IST)

    12వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ముందంజ…

    12వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ముందంజ…
    7836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్..

  • 06 Nov 2022 03:47 PM (IST)

    టీఆర్ఎస్‌కు చివరి ఎన్నిక.. బీఆర్ఎస్‌కు తొలి విజయం..!

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలనే.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు ఉపఎన్నిక చివరిది కానుంది. బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత అనధికారికంగా తొలి విజయం కానుంది.

  • 06 Nov 2022 03:43 PM (IST)

    కేసీఆర్‌తో తెలంగాణ.. హరీశ్ రావు.. ట్వీట్

    కేసీఆర్‌తో తెలంగాణ

    మునుగోడులో టీఆర్ఎస్ విజయం దిశగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్ చేశారు. కేసీఆర్ తో తెలంగాణ ఉందంటూ ట్వీట్ చేశారు.

  • 06 Nov 2022 03:34 PM (IST)

    మరికాసేపట్లో తెలంగాణ భనవ్‌కు కేటీఆర్

    మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం దిశగా పయనిస్తోంది. దీంతో తెలంగాణ భవన్లో గులాబీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. స్వీట్లు పంచుకుని.. టపాసులు కాల్చుతున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకోనున్నారు.

  • 06 Nov 2022 03:30 PM (IST)

    కొనసాగుతోన్న 12వ రౌండ్ కౌంటింగ్

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశలో కొనసాగుతోంది. 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 11 రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ 5794 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్‌లో టీఆర్ఎస్ కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి.

  • 06 Nov 2022 03:23 PM (IST)

    విజయం దిశగా టీఆర్ఎస్..

    ఇప్పటివరకు పోలైన ఓట్ల ప్రకారం..

    కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 74,594

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – 68,800

    పాల్వాయి స్రవంతి -16,280

    టీఆర్ఎస్ 5794 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 03:22 PM (IST)

    మునుగోడులో కారు జోరు..

    తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సంబరాలు..

  • 06 Nov 2022 03:16 PM (IST)

    రెండు రౌండ్లలో బీజేపీ.. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 రౌండ్‌లు పూర్తవ్వగా.. టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది.

    2, 3 రౌండ్లు మినహా బీజేపీ ఏ విధంగా ప్రభావం చూపలేకపోయింది. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యంతో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 03:09 PM (IST)

    తొమ్మిది రౌండ్ల వరకు పోలైన ఓట్లు.. ఇలా

    తొమ్మిది రౌండ్ల వరకు అధికారికంగా పోలైన ఓట్ల వివరాలు..

    9th Round

    9th Round 2

  • 06 Nov 2022 03:07 PM (IST)

    11వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్ 1358

    11వ రౌండ్ లో టీఆర్ఎస్ 7235, బిజేపి 5877

    టీఆర్ఎస్ లీడ్ 1358

    11 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 5774 ఓట్ల లీడ్

  • 06 Nov 2022 03:04 PM (IST)

    11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

    దూసుకెళ్తున్న టీఆర్ఎస్.. 11వ రౌండ్‌లోనూ ఆధిక్యం..

    టీఆర్ఎస్ 5,800 లీడ్‌లో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 03:00 PM (IST)

    తెలంగాణ భవన్లో మొదలైన సంబరాలు..

    తెలంగాణ భవన్లో మొదలైన సంబరాలు..

    బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు..

  • 06 Nov 2022 02:56 PM (IST)

    కార్‌ను పోలిన గుర్తులకు భారీగా ఓట్లు..

    TRS మెజారిటీని దెబ్బతీస్తున్న కార్‌ను పోలిన గుర్తులు..

    చపాతీ మేకర్ – 1169

    రోడ్ రోలర్ – 904

    చప్పల్ (రెండో EVM లో రెండో నంబర్ ) – 1142

    మొత్తం — 3215

    ఇప్పటికే ఇన్ని ఓట్లు కోల్పోయింది TRS వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • 06 Nov 2022 02:53 PM (IST)

    10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

    10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం..

    టీఆర్ఎస్ 7499

    బిజేపీ 7015

    టీఆర్ఎస్ లీడ్ 484

    10 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 4416 ఓట్ల లీడ్.

  • 06 Nov 2022 02:51 PM (IST)

    టీఆర్ఎస్‌ను దెబ్బ తీస్తోన్న కారును పోలిన గుర్తులు..

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని.. కారును పోలిన గుర్తులు దెబ్బ తీస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంలలో కారు మాదిరిగా చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులు ఉన్నాయి. వాటికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి చపాతీ రోలర్‌కు 994, రోడ్డు రోలర్‌కు 746 ఓట్లు వచ్చాయి.

  • 06 Nov 2022 02:47 PM (IST)

    పొర్లగడ్డలో టీఆర్ఎస్ ఆధిక్యం

    మంత్రి సత్యవతి రాథోడ్ ఇంచార్జిగా ఉన్న సంస్థ నారాయణపురం పొర్లగడ్డలో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది.

  • 06 Nov 2022 02:41 PM (IST)

    కొనసాగుతున్న పదో రౌండ్ ఓట్ల లెక్కింపు

    పదవ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు లెక్కించిన 9 రౌండ్లలో టీఆర్ఎస్ 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 02:38 PM (IST)

    ఎనిమిదో రౌండ్లో పార్టీల వారీగా పోలైన ఓట్లు..

    ఎనిమిదో రౌండ్లో పార్టీల వారీగా పోలైన ఓట్లు..

    8th Round

    8th Round2

  • 06 Nov 2022 02:30 PM (IST)

    3925 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

    చండూరులో టీఆర్ఎస్ ఆధిక్యం..

    9 రౌండ్లు ముగిసేసరికి 3925 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

  • 06 Nov 2022 02:29 PM (IST)

    9వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7497

    9వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7497, బీజేపి కి 6665 ఓట్లు వచ్చాయి.

    టీఆర్ఎస్ లీడ్ 832..

    తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 3923 ఓట్లు

  • 06 Nov 2022 02:28 PM (IST)

    ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివేలలో బీజేపీ లీడ్

    బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివేల గ్రామంలో 400 ఓట్లకు పైగా బిజెపి లీడ్..

    టీఆరెఎస్ పార్టీ నుంచి ఇదే గ్రామానికి ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ..

  • 06 Nov 2022 02:23 PM (IST)

    9వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్

    మునుగోడులో ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. తాజా 9వ రౌండ్‌లో టీఆర్ఎస్- 3925 లీడ్‌తో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 01:50 PM (IST)

    8వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్

    మునుగోడులో ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. తాజా 8వ రౌండ్‌లో టీఆర్ఎస్- 6624, బీజేపీ -6088 ఓట్లు వచ్చాయి. టీఆరెఎస్ లీడ్ 536 వచ్చింది. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 3091 ఓట్ల లీడ్‌లో కొనసాగుతోంది.

  • 06 Nov 2022 01:27 PM (IST)

    ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్..

    మునుగోడు బైపోల్‌ ఫలితాల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఏడో రౌండ్‌లో టీఆర్ఎస్ – 7189, బిజేపి -6803 ఓట్లు వచ్చాయి. ఈ ఏడో రౌండ్‌లో టీఆరెఎస్‌కు 386 ఓట్ల లీడ్ వచ్చింది. ఏడు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 2555 ఓట్లు వచ్చాయి.

  • 06 Nov 2022 01:05 PM (IST)

    ఆరో రౌండ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

    మునుగోడు ఓట్ల లెక్కింపు హై టెన్సన్ క్రియేట్ చేస్తోంది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మునుగోడు రూరల్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 2169కు చేరింది. ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ – 6016, బిజేపి -5378 ఓట్లు వచ్చాయి. అయితే ఈ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్ 638 దక్కించుకుంది.
    అరు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 2169కు చేరింది.

  • 06 Nov 2022 12:40 PM (IST)

    ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం..

    మునుగోడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం మునుగోడు రూరల్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి కారు ఆధిక్యం 2169కు చేరింది.

  • 06 Nov 2022 12:37 PM (IST)

    కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగానే ఉంది – సీఈవో వికాస్‌ రాజ్‌

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున ఎక్కువ సమయం పడుతోందన్నారు. ప్రతి టేబుల్‌ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తామని వెల్లడించారు.

  • 06 Nov 2022 12:11 PM (IST)

    200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం- కేఏ పాల్

    మునుగోడు ఉస ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

  • 06 Nov 2022 12:10 PM (IST)

    టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఇవ్వడం లేదు – బండి సంజయ్

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ లీడ్‌లోకి వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేని ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

  • 06 Nov 2022 12:08 PM (IST)

    అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు – శ్రీధర్ బాబు

    మునుగోడు ఎన్నికలో ధనం, మద్యం ఎలా వెదజల్లాయో చూశామన్నారు కాంగ్రెస్‌‌  ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు. టీఆర్ఎస్, బీజేపీ అధికార బలాన్ని కూడా ఉపయోగించాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిందన్నారు కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి.

  • 06 Nov 2022 12:06 PM (IST)

    వికాస్ రాజ్‌కు ఈటల రాజేందర్ సూచన..

    రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడారు ఈటల రాజేందర్. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చింది. ఫలితాలు సక్రమంగా వెల్లడించండి. గెలుపు, ఓటములు సహజం కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండని వికాస్ రాజ్‌కు సూచించారు ఈటల రాజేందర్.

  • 06 Nov 2022 11:42 AM (IST)

    ఐదో రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్..

    అయిదవ రౌండ్‌లో టీఆర్ఎస్ 6162 బీజేపీ- 5245 కాంగ్రెస్ రాలేదు.. టీఆరెఎస్ లీడ్ 917.. అయిదు రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 1631 ఓట్ల లీడ్ వచ్చింది.

  • 06 Nov 2022 11:39 AM (IST)

    ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పైన టిఆర్ఎస్ పార్టీ ఆగ్రహం

    రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

  • 06 Nov 2022 11:26 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ధర్నా.. ఎందుకంటే..

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాం.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య దోబూచులాడుతోంది. రౌండ్‌ రౌండ్‌కు అధిక్యం మారుతూ ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తికాగా… టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఫలితాల వివరాలను కౌంటింగ్ అధికారులు వెల్లడించడం లేదని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ధర్నాకు దిగారు. అధికారులు కౌంటింగ్ సంబంధించిన వివరాలను మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

  • 06 Nov 2022 11:21 AM (IST)

    ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

    రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.  రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఎందుకు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను ఎలా అప్ లోడ్ చేశారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్‌గా తీసుకుంది.

  • 06 Nov 2022 11:09 AM (IST)

    ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్.. ఎంతంటే

    ఐదు రౌండ్లు ముగిసే సరికి 1034 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్.

  • 06 Nov 2022 10:59 AM (IST)

    అధికారిక లెక్కల్లో టీఆర్ఎస్ లీడ్.. ఎంతంటే..

    నాలుగు రౌండ్లు ప్రకారం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 714 ఓట్లు లీడ్‌లో టీఆర్ఎస్ ఉందని ఈసీ వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబచరిన టీఆర్ఎస్.. ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 2,3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.. నాలుగో రౌండ్ ముగిసేసరికి తిరిగి టీఆర్ఎస్ పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యత సాధించింది..

    మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలుత చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా… టీఆర్ఎస్ కు 613 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్.. ఆ వెంటనే 2, 3 రౌండ్లలో వెనుకడిపోయింది. అయితే నాలుగో రౌండ్ తో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బీజేపీని వెనక్కు నెట్టేసి తిరిగి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఓవరాల్ గా బీజేపీపై 613 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపును పూర్తి చేసిన అధికారులు.. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.

     

  • 06 Nov 2022 10:57 AM (IST)

    కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దు – భట్టి విక్రమార్క

    ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇది ఒక సాధారణ ఉప ఎన్నిక మాత్రమే అని అన్నారు. ఈ ఎన్నికల ప్రభావం రానున్ను ఎన్నికల పైన ఉండదన్నారు. ప్రజాస్వామ్య ని అపహాస్యం చేయడం కోసం జరిగిన ఎన్నిక ఇదని అభివర్ణించారు.

  • 06 Nov 2022 10:54 AM (IST)

    చౌటుప్పల్ మండలంలో అనుకున్న మెజార్టీ రాలేదు-బీజేపీ అభ్యర్థి

    రాజగోపాల్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలో అనుకున్న మెజార్టీ రాలేదన్నారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పారు. చివరి వరకు హోరాహోరీ పోరు తప్పక పోవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ధీమా వ్యక్తం చేశారు.  ఇదిలావుంటే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలవారు ఆసక్తి మునుగోడు ఉప ఎన్నికను పరిశీలస్తున్నారు.అయితే విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రౌండ్ల తర్వాత 613 ఓట్లతో టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.

  • 06 Nov 2022 10:35 AM (IST)

    ముంత్రులు ఇంఛార్జీలుగా ఉన్న చోట కారుకు బ్రేకులు..

    తొలి రౌండ్‌లో లీడ్ దక్కించుకున్న టీఆర్ఎస్.. ఆతర్వాత వెనుకబడింది. రెండో రౌండ్ నుంచి ఐదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది. అయితే మంత్రులు ఇంఛార్జీలుగా వ్యవహరించిన మండలాల్లో బీజేపీకి లీడ్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డివారి గ్రామంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంఛార్జిగా ఉన్న లింగోజిగూడెంలోనూ బీజేపీనే అధిక్యంలోకి వచ్చింది. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దేవులమ్మ నాగారంలో బీజేపీ లీడ్ వచ్చింది.

  • 06 Nov 2022 10:26 AM (IST)

    సరూర్‌ నగర్ బీజేపీ కార్పొరేటర్ కార్యాలయంలో సంబురాలు..

    రెండో రౌండ్ నుంచి బీజేపీ లీడ్ రావడంతో బీజేపీ కార్యకర్తలు సంబురాలు మొదలు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీ వాణి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు డ్యాన్సులు మొదలు పెట్టారు.

     

     

     

  • 06 Nov 2022 10:22 AM (IST)

    టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్..

    టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి షాక్ తగిలింది. స్వగ్రామం లింగవారి గూడెంలో వెనుకంజలో ఉన్నారు.  బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది.

  • 06 Nov 2022 10:11 AM (IST)

    ఐదో రౌండ్‌లో బీజేపీ లీడ్..

    తొలి రౌండ్‌లో మాత్రమే కనిపించిన కారు.. ఆ తర్వాత నెమ్మదించింది. రెండో రౌండ్‌ నుంచి తాజాగా 5వ రౌండ్‌ వరకు బీజేపీ ఆధిక్యంలో ఉంది.

     

  • 06 Nov 2022 10:06 AM (IST)

    మునుగోడు ఫలితాల్లో మండలాలవారీగా..

    మునుగోడు ఫలితాల్లో మండలాలవారీగా నమోదైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

    1. చండూరు మండలంలో పోలైన ఓట్లు 31,333.. శాతం 93.51
    2. చౌటుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు 55,678.. శాతం 93.68
    3. గట్టుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు 13,452.. శాతం 92.63
    4. మర్రిగూడ మండలంలో పోలైన ఓట్లు 25,877.. శాతం 91.42
    5. మునుగోడు మండలంలో పోలైన ఓట్లు 33,455.. శాతం 93.51
    6. నాంప్లలి మండలంలో పోలైన ఓట్లు 31,240.. శాతం 92.34
    7. నారాయణపూర్‌ మండలంలో పోలైన ఓట్లు 34,157.. శాతం 93.77
  • 06 Nov 2022 09:56 AM (IST)

    నాలుగో రౌండ్‌లో బీజేపీకి లీడ్‌

    తొలి రౌండ్‌లో మాత్రమే టీఆర్ఎస్‌ లీడ్ దక్కించుకోగా.. రెండో రౌండ్‌ నుంచి నాలుగో రౌండ్ వరకు కారు స్లోగా ముందుకు కదులుతోంది. తాజాగా నాలుగో రౌండ్‌లో కూడా బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.

     

  • 06 Nov 2022 09:45 AM (IST)

    ఎవరెవరికి ఎన్ని ఓట్లు.. ఈసీ చెప్పిన లెక్క ఇదే..

    ఎన్నికల అధికారులు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం ఓట్ల ఫలితాలు ఇలా ఉన్నాయి.

    EC Announcement on First Round

  • 06 Nov 2022 09:34 AM (IST)

    మూడో రౌండ్‌లో బీజేపీ దూకుడు.. వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యం..

    తొలి రౌండ్‌లో మాత్రమే కారు దూసుకొచ్చినా.. రెండు, మూడు రౌండ్లలో మాత్రం బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.

     

  • 06 Nov 2022 09:28 AM (IST)

    రెండు రౌండ్లు ముగిసే సరికి TRSకు 515 ఓట్ల లీడ్

    మునుగోడులో బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. రెండు రౌండ్లు ముగిసే సరికి TRSకు 515 ఓట్ల లీడ్ దక్కింది.

  • 06 Nov 2022 09:13 AM (IST)

    రెండో రౌండ్‌లో బీజేపీ లీడ్..

    తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌ లీడ్ దక్కించుకోగా.. రెండో రౌండ్‌లో మాత్రం కారు వెనకబడింది. దీంతో బీజేపీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో రౌండ్ లో 1192 పై చిలుకు ఓట్ల బీజేపీ లీడ్.

     

  • 06 Nov 2022 09:06 AM (IST)

    మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ కొనసాగుతోంది. తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. కారు ఆధిక్యంలో కొనసాగుతోంది. వెయ్యికిపైగా ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ 6096, బీజేపీ 4904, కాంగ్రెస్ 1877 , తొలి రౌండ్‌లో ఇతరులు-1676, మొత్తం- లీడ్ 1192 ఓట్లు.

  • 06 Nov 2022 08:56 AM (IST)

    తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం..

    మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌‌లో కారు దూసుకొచ్చింది. చౌటుప్పల్‌లో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 1192 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

  • 06 Nov 2022 08:54 AM (IST)

    మునుగోడు ఎవరికి అనుకూలం…

    పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పార్టీల్లో గుబులు రేపుతోంది.. మునుగోడులో మొత్తం ఓట్లు 2,41 వేల 805. ఇందులో 2,25 వేల 192 ఓట్లు పోలయ్యాయి. అంటే 93.1 శాతం. అదే 2018 ఎన్నికల్లో 91.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 2 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం అన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే పోలింగ్ శాతం. సామాజిక సమీకరణాలపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ఈసారి యూత్‌ కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేశారు. వాళ్లు ఎటువైపు మొగ్గారన్నది కూడా కీలకం కానుంది.

  • 06 Nov 2022 08:47 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం..

    మునుగోడు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తయ్యింది. దీనిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్- 228, బీజేపీ- 224, బీఎస్పీకి 10 ఓట్లు, ఇతరులకు 88 ఓట్లు వచ్చాయి.

  • 06 Nov 2022 08:45 AM (IST)

    తొలి రౌండ్‌ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధిక్యం..

    తొలి పోలింగ్ కేంద్రం చోటుప్పల్ మండలం జై కేసారంలో టీఆర్ఎస్ ఆధిక్యం…

  • 06 Nov 2022 08:40 AM (IST)

    కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం

    మునుగోడ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభానికి ముందే ఆయా పార్టీల అభ్యర్థులు నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కుర్చీపై కూర్చొని ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల షేక్ హ్యాండ్ ఇచ్చారు. వారిద్దరూ కరచాలనం చేసుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

  • 06 Nov 2022 08:38 AM (IST)

    చౌటుప్పల్‌‌ ఓటరు ఎవరికి జై కొట్టారు..

    చౌటుప్పల్‌లో మొత్తం ఓట్లు 59, 433 ఓట్లు. ఇందులో 55, 678 ఓట్లు పోలయ్యాయి. అటే 93.68 శాతం.! మరి ఇక్కడి ఓటర్లు ఎవరివైపు మొగ్గారు. ఎవరికి జై కొట్టారు అన్నది కీలకం కానుంది. తుది ఫలితాలపై కచ్చితంగా ఈ మండలం ఎఫెక్ట్ ఉంటుంది.. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. ఇక్కడ 34,157 ఓట్లు పోలయ్యాయి. చౌటుప్పల్, నారాయణపూర్ ఈ రెండు మండలాల ఓట్లు కలిపితే దాదాపు 90 వేల ఓట్లు. పైగా మొదటి 6 రౌండ్లు ఈ మండలాల రిజల్టే వస్తాయి.

  • 06 Nov 2022 08:34 AM (IST)

    మొత్తం 15 రౌండ్లు ఏ రౌండ్లలో..

    మునుగోడులో మొత్తం 15 రౌండ్లు ఏ రౌండ్లలో ఏ మండలం ఓట్లు లెక్కింపు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

    > చౌటుప్పల్ 1, 2, 3, 4

    > నారాయణపురం 4, 5, 6

    > మునుగోడు 6, 7, 8

    > చండూరు 8, 9, 10

    > గట్టుప్పల్ 10, 11

    > మర్రిగూడ 11, 12, 13

    > నాంపల్లి 13, 14, 15

    కొన్ని మండలాల కౌంటింగ్ రెండు రౌండ్లలోనూ కొనసాగుతుంది.

  • 06 Nov 2022 08:33 AM (IST)

    15 రౌండ్లలో లెక్కింపు..

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. చివరి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

  • 06 Nov 2022 08:31 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ లీడ్..

    2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ లీడ్ దక్కించుకుంది. మునుగోడు ఓటరు ఎటువైపు..? అనేది కాసేపట్లో తేలనుంది. మొదలైన EVMల ఓట్ల లెక్కింపులో మొదట చౌటుప్పల్‌ మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రతి అరగంటకు ఓ రౌండ్ రిజల్ట్ ప్రకటిస్తారు. మధ్యాహ్నం కల్లా తుది ఫలితం ఉంటుంది.

  • 06 Nov 2022 08:20 AM (IST)

    కౌంటింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు..

    మునుగోడు ఉప ఎన్నికల తొలి రౌండ్ ఫలితం ఉదయం 9 గం.లకు వెలువడనుంది. మొదట చౌటుప్పల్ మండలంలోని ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. ప్రతి అరగంటకు ఓ రౌండ్ ఫలితం వెలువడనుంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. 21 టేబుళ్లపై ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

    ఆయా పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ప్రారంభానికి ముందే నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ముందుగా ఉదయం 8 గం.లకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఆ తర్వాత సర్వీస్ ఓట్ల కౌంటింగ్ చేపడ్తారు. ఇది ముగిసిన తర్వాత 8.30 గం.లకు ఈవీఎంల లెక్కింపు చేపడుతారు.

  • 06 Nov 2022 08:16 AM (IST)

    మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు.. చివరి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే..

    మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. చివరి రౌండ్‌ ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వచ్చే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు.ఓట్ల లెక్కింపు విధుల్లో మొత్తం 250 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. లెక్కింపు కోసం 100 మంది.. ఇతర కార్యకలాపాలకు 150 మందిని కేటాయించారు. ముందుగా చౌటుప్పల్‌, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు చేపడతారు.

    మునుగోడు ఓట్ల లెక్కింపు లైవ్ కోసం ఇక్కడ చూడండి..

  • 06 Nov 2022 08:15 AM (IST)

    మునుగోడు ఉపఎన్నికల్లో మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలు

    మునుగోడులో మొత్తం పోలైన ఓట్లు 2,25,192
    2018 కంటే 1.82 శాతం పెరిగిన పోలింగ్‌ శాతం
    మునుగోడు ఫలితాల్లో మండలాలవారీగా ఆధిక్యంపైనా ఉత్కంఠ
    ముందుగా చౌటుప్పల్‌ మండలం ఓట్ల లెక్కింపు

    మండలాల వారీగా..
    చండూరు మండలంలో పోలైన ఓట్లు 31,333.. శాతం 93.51
    చౌటుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు 55,678.. శాతం 93.68
    గట్టుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు 13,452.. శాతం 92.63
    మర్రిగూడ మండలంలో పోలైన ఓట్లు 25,877.. శాతం 91.42
    మునుగోడు మండలంలో పోలైన ఓట్లు 33,455.. శాతం 93.51
    నాంప్లలి మండలంలో పోలైన ఓట్లు 31,240.. శాతం 92.34
    నారాయణపూర్‌ మండలంలో పోలైన ఓట్లు 34,157.. శాతం 93.77

  • 06 Nov 2022 08:13 AM (IST)

    8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు.. తొలి ఫలితం ఎప్పుడంటే..

    దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపట్టారు. 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. ఉదయం 9 తర్వాత తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉంది.

  • 06 Nov 2022 07:58 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్ షురూ…

    టెన్షన్‌ పెరిగిపోతోంది. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచారు. పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్ షురూ అయింది. మొత్తం 2 టేబుళ్లలో 686 ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సర్వీస్ ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. అనంతరం EVMలను ఓపెన్ చేస్తారు. అప్పుడే మొదలవుతుంది అసలు సినిమా. రౌండ్‌ టు రౌండ్ హైవోల్టేజ్ హీట్ పక్కా.! 21 టేబుళ్లు..15 రౌండ్లు..! దాదాపు ప్రతి అరగంటకూ ఓ రౌండ్ ఫలితం తేలిపోతుంది. మొదట చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కిస్తారు..తొలి మూడు రౌండ్లలోనూ ఇదే మండలం నుంచి రిజల్ట్స్‌ వస్తాయి. 7 మండలాల్లో అత్యధిక ఓట్లు ఇక్కడే ఉన్నాయి. అత్యధిక ఓటింగ్ శాతం కూడా ఇక్కడే నమోదైంది

  • 06 Nov 2022 07:33 AM (IST)

    కాసేపట్లో తేలనున్న మునుగోడు మొనగాడు..

    మునుగోడు మొనగాడెవరో మరికాసేపట్లో తేలిపోనుంది. అయితే, మునుగోడు ఫలితంపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మునుగోడులో ఎగిరేది కాషాయ జెండానే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. రాజ్‌గోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమంటూ బల్లగుద్దిమరీ చెబుతున్నారు

  • 06 Nov 2022 07:29 AM (IST)

    యువత సైలెంట్ ఓటింగ్..వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వార్..?

    యువత సైలెంట్ ఓటింగ్ మునుగోడు ఫలితాలను తారు మారు చేస్తాయనున్నాయి. దీనికితోడు పెరిగిన ఓటింగ్.. యువత సైలెంట్ ఓటింగ్ వార్ వన్ సైడేనా.. లేదా టగ్ ఆఫ్ వార్ ను తలపిస్తుందా అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది.

  • 06 Nov 2022 07:27 AM (IST)

    మూడంచెల భద్రత.. సీసీ కెమెరాల పర్యవేక్షణ..- కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి

    కౌంటింగ్ కేంద్రం దగ్గర టైట్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను మోహరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్​ బలగాలతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశామని నల్గొండ కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

  • 06 Nov 2022 07:24 AM (IST)

    2లక్షల 25వేల 192 మంది ఓట్లు పోలైనవి..

    మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ.. 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్​హౌసింగ్​ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూమ్‌లో భద్రపర్చారు.

  • 06 Nov 2022 07:06 AM (IST)

    మునుగోడు ఉపఎన్నిక విజేత ఎవరో అనేది మరికొన్ని గంటల్లోనే..

    ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక విజేత ఎవరో అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. హోరాహోరీగా పోరాడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కానుంది. మొదటి రౌండ్‌ ఫలితం 9 గంటలు రానుండగా.. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు విడుదల అవుతుందని అధికారులు అంచనా వేశారు.

  • 06 Nov 2022 07:05 AM (IST)

    తెలుగు రాష్ట్రాలకు మునుగోడు ఫీవర్‌..

    తెలుగు రాష్ట్రాలకు మునుగోడు ఫీవర్‌ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మునుగోడు ఫలితంపైనే చర్చ జరుగుతోంది. మరికాసేపట్లో మొదలు కానున్న మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌పై ఎక్కడ చూసినా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎవరి అంచనాలో వారు ఉండడమే కాకుండా.. గెలుపుపై ఆయా పార్టీలు ధీమాగా ఉన్నాయి. గెలుపుపై టీఆర్‌ఎస్‌, బీజేపీలు విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. అనూహ్య ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ చెబుతోంది.

  • 06 Nov 2022 07:03 AM (IST)

    ముగ్గురు ఢిల్లీ పరిశీలకుల పర్యవేక్షణ..

    మునుగోడు ఉపఎన్నికలో 93.13శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు ఉంటే.. 2 లక్షల 25 వేల 192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు ఢిల్లీ పరిశీలకుల పర్యవేక్షణ.. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, సీసీ కెమెరాల సమక్షంలో టోటల్‌ కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది.

  • 06 Nov 2022 07:02 AM (IST)

    చౌటుప్పల్‌ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం..

    మొదటగా చౌటుప్పల్‌ మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. చౌటుప్పల్‌ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కిస్తారు. ఒక్క రౌండ్‌ ఫలితానికి 20 నుంచి 30 నిమిషాలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు తుది ఫలితం వెలువడే అవకాశముంది.

  • 06 Nov 2022 07:01 AM (IST)

    8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు..

    8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభమవుతుంది. 686 పోలైన పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. 2 టేబుళ్లలో ఈ పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆతర్వాత ఎలక్ట్రానిక్‌ విధానంలో సర్వీసు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంటలో ఈ పక్రియ పూర్తయిన తర్వాత.. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి 3 రౌండ్లలో చౌటుప్పల్‌ మండలం లెక్కింపు జరగనుంది. చౌటుప్పల్‌ మండలంలో పోలైన ఓట్లు 55,678 ఉన్నాయి.

  • 06 Nov 2022 06:49 AM (IST)

    మునుగోడు ఫలితాలపై ఉత్కంఠ

    మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మునుగోడు మొనగాడు ఎవరోన్నన ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. అటు నేతల్లో, ప్రజల్లో ఫలితాలపై ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  • 06 Nov 2022 06:43 AM (IST)

    మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

    మునుగోడు ఓట్ల లెక్కింపులో మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. 1,2,3 రౌండ్లలో చౌటుప్పల మండలం లెక్కించనున్నారు. 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 7,8 రౌండ్లలో మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 9,10 రౌండ్లలో చండూరు మండలం, 11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గుట్టుప్పల్‌ మండలాల ఓట్లను లెక్కించనున్నారు.

  • 06 Nov 2022 06:28 AM (IST)

    ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

    మరికొద్దిసేపట్లో మునుగోడు ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిగా, ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభరం కానుంది. 9 గంటలరకు ఫస్ట్‌రౌండ్‌ రిజల్ట్‌ రానుంది.

Follow us on