
Mulugu district news: ప్రభుత్వ పాఠశాలపై గొంగళిపురుగులు దండెత్తాయి. పాఠశాల గోడలు, చుట్టూ ఉన్న చెట్లు అన్నీ గొంగళిపురుగులతో నిండిపోయాయి. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విద్యార్ధులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులు పాఠశాలకు సెలకు ప్రకటించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని మర్రిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఈ విచిత్ర సమస్య తలెత్తింది. ఈ ప్రభుత్వ పాఠశాలలోపల, ఆవరణ మొత్తం గొంగళి పురుగులు తిష్టవేశాయి. పెద్దసంఖ్యలో పురుగులు పాఠశాలలోకి ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు.
పాఠశాల ఆవరణలోని చెట్లు, బిల్డింగ్ మొత్తం గొంగళిపురుగులు తిరుగుతున్నాయి. ఆ పురుగులు విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై పడుతుండటంతో ఒంటిపై దద్దుర్లు ఏర్పడి దురద, మంటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో స్కూలుకి రావాలంటేనే భయపడుతున్నారు విద్యార్ధులు. వెంటనే గొంగళిపురుల నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్కూల్ పరిసరాల్లోని చెట్లు, బిల్డింగ్‌లు మొత్తం గొంగళి పురుగులు చుట్టుముట్టడంతో ఉపాధ్యాయులు, అధికారులు అయోమయంలో ఉన్నారు. అయితే, విద్యార్థులకు చర్మ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయని.. దీంతో పాఠశాలలో అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్నారని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..