ఇల్లందు సింగరేణిలో మొహర్రం..అదో మానని గాయం

ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్‌. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా […]

ఇల్లందు సింగరేణిలో మొహర్రం..అదో మానని గాయం
Follow us

|

Updated on: Sep 10, 2019 | 2:40 PM

ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్‌. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా నిర్వహిస్తోంది. అంతేకాదు.. ఇల్లందులో మొహర్రంకు, శుక్రవారం సెలవుకు వెనక ఏళ్లనాటి చరిత్రే ఉందంటున్నారు సింగరేణి యజమాన్యం, సిబ్బంది. ఇల్లందు ఏరియాలో బ్రిటిష్ భూగర్భ పరిశోధన అధికారి విలియం కింగ్ 1871 లో ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “ది దక్కన్ కంపెనీ లిమిటెడ్” అనే ప్రైవేట్ కంపెనీ 1886లో త్రవ్వకాలను ప్రారంభించింది. 1889 నాటికి ఉత్పత్తిని ప్రారంభించింది.( బ్రిటిష్ హయాంలో బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో ఉండేది.) అనంతరం బొగ్గును సింగరేణి అనే గ్రామం వద్ద కనిపెట్టడంతో 1920 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చుతూ పబ్లిక్ లిమిటెడ్ చేశారు.  ఇల్లందులో అండర్ గ్రౌండ్ ద్వారా బొగ్గు ఉత్పత్తిని వెలికి తీస్తున్నారు.

పూసపల్ల సమీపంలో స్టట్ ఇంక్లైన్ భూగర్భ గనిలో 1938 మార్చి 12వ తారీకున ఘోర గని ప్రమాదం జరిగింది. మృత్యు రూపంలో విషవాయువులు గనిని వ్యాపించాయి. జనరల్ మేనేజర్, మేనేజర్ లతోపాటు 35 మంది కార్మికులు, ఆరుగురు మహిళా కార్మికులు మొత్తం 43 మంది విషవాయువు పీల్చుకుని మృతి చెందారు. సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలోనే ఇది పెద్ద ప్రమాద సంఘటన. చారిత్రకమైన అంశం. కార్మికులు మృతి చెందిన రోజు శుక్రవారం. అదే రోజు.43 మంది మృతికి జ్ఞాపకార్ధంగా శుక్రవారం అప్పటి బ్రిటీష్ గవర్నమెంట్ ఇల్లందు ఏరియాలో సెలవులు ప్రకటించింది. అదేవిధంగా మొహరం రోజు ప్రమాదం జరిగి నందున ప్రతి సంవత్సరం మొహరం పండుగ కు సింగరేణి వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. కార్మికులు మృతి చెందిన  స్టట్ ఇంక్లైన్ వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీ స్థూపాన్ని నిర్మించింది. ఇక్కడి 24 ఏరియాలో మృతుల సమాధులను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆనవాయితీ నేటి వరకు ఇప్పటి సింగరేణి యాజమాన్యం కొనసాగిస్తుంది. ఇల్లందు తో పాటు అన్ని సింగరేణి ఏరియాలలో  మోహరం రోజు సెలవుగా ప్రకటిస్తారు.. కానీ శుక్రవారం మాత్రం ఇల్లందు ఏరియా కు మాత్రమే సెలవు దినంగా జరుపుకుంటారు.. మిగిలిన అన్ని సింగరేణి ఏరియాలలో ఆదివారం మాత్రమే వారంతపు సెలవుగా ఉంది. ఇక కార్మికుల మృతి చెందిన రోజున ఇల్లందు ఏరియా సింగరేణి అధికారులు సంస్మరణ సభ నిర్వహించి మృతులకు ఘనంగా నివాళులు అర్పిస్తారు.
ఇదిలా ఉండగా  సింగరేణి బొగ్గు పుట్టినిల్లు అయిన ఇల్లందు ఏరియా చరిత్రలో నిలిచిపోయే విధంగా బొగ్గు ఉత్పత్తిని సాధించింది. కోట్ల సంపదను ఈ దేశానికి అందించింది అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఇల్లందు ను తరతరాలుగా గుర్తుండి పోయేలా పర్యాటక కేంద్రంగా మార్చాలని, మ్యూజియంలు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, కార్మికులు కోరుతున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో