AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallu Ravi: అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు.. ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

రాజ్యసభ సీటు దొరకలేదనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారని ఎంపీ మల్లురవి అన్నారు. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని, దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన జీవన్‌ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల వంటి వారికి వచ్చిన పరిస్థితి జీవన్‌ రెడ్డికి రావొద్దని కొరుకుంటున్నా అన్నారు.

Mallu Ravi: అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు.. ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు
Mp Mallu Ravi Responds To Jeevan Reddy's Resignation
Anand T
|

Updated on: Apr 11, 2026 | 1:19 PM

Share

మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లురవి కీలక వ్యాఖ్యలు చేశారు.రాజ్యసభ అవకాశం దొరకలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారన్నారు. బిఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని.. బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు, జీవన్ రెడ్డి అలాంటి పరిస్థితి రావొద్దు అని కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసిన ఈటెల రాజేందర్, రాజయ్య లాంటి వారిని బయటికి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించి,14 సార్లు పార్టీ సభ్యత్వంపై జీవన్ రెడ్డి పోటీ చేశారని మల్లురవి అన్నారు. జీవన్ రెడ్డిని ఇలా చూడడం బాధాకరంగా ఉందన్నారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే వారిపైనే జీవన్ రెడ్డి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని.. దొరల గడీలకు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి తండ్రి, జీవన్ రెడ్డి పోరాటం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లారని.. కరీంనగర్ ప్రజలకు,రైతులకు జీవన్ రెడ్డి ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలియట్లేదన్నారు.

పెత్తందారు, దొరల వ్యవస్థకు జీవన్ రెడ్డి అనుకూలంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.. బీఆర్ఎస్‌లో చేరిన రోజే పండగ అని, తర్వాత అంతా దండగే అన్నారు. ప్రత్యేక గుర్తింపు, పదవులు ఇస్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పేది ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని, జీవితం అంత పెంచుకున్న వ్యక్తిత్వాన్ని జీవన్ రెడ్డి దెబ్బతీసుకోకూడదన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడడం ఎంతవరకు సమంజసం?.. కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన ఏం సంకేతం ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ,కేసీఆర్ పాలనా దేనికోసం రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?
ఓరీ దేవుడో తినేటప్పుడు మళ్లీ ఉప్పు చల్లుకుని తింటే ఇంత డేంజరా?