Telangana: కరీంగనర్‌లో మిస్టరీ మరణాలు.. నెల రోజుల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి.. ల్యాబ్‌కి బ్లడ్ శాంపిల్స్

|

Dec 21, 2022 | 4:09 PM

కరీంగనర్‌లో అంతుచిక్కని వ్యాధి భయపెడుతుంది. ఒకే ఇంట్లో ముగ్గురి మరణంతో గ్రామంలో విషాదం నెలకుంది. నెల రోజుల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

Telangana: కరీంగనర్‌లో మిస్టరీ మరణాలు.. నెల రోజుల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు మృతి.. ల్యాబ్‌కి బ్లడ్ శాంపిల్స్
Gangadhara Mysterious Deaths
Follow us on

అభం, శుభం తెలియని చిన్నారులు. స్కూల్‌కు వెళ్లడం, ఇంటికొచ్చాక ఆటలు ఆడటం వారి లోకం. ఏం జరిగిందో తెలియదు. వారి మృతి ఇప్పుడు మిస్టరీగా మారింది. తల్లి సహా ఇద్దరు పిల్లల మృతి కరీంనగర్‌లో కలకలం రేపుతోంది. నెలరోజుల వ్యవధిలో తల్లి మమత, కూతురు అమూల్య, కుమారుడు అధ్వైత్ మృతి చెందారు. ముందు బాబు, ఆ తర్వాత పాప, ఆపై తల్లి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురూ.. ఒకే రకమైన లక్షణాలతో మృతి చెందారు. వాంతులు, విరేచనాలు, మూత్ర వ్యవస్థ ఫెయిల్యూర్, బీపీ కంట్రోల్‌ కాక, ఫిట్స్ రావడంతో చనిపోయారని శ్రీకాంత్ చెప్తున్నాడు. రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా ఉన్నా.. ఇంటర్నల్‌ ఆర్గాన్స్ ఒక్కోటి డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెప్పారంటున్నాడు శ్రీకాంత్.

ఏంటి మిస్టరీ? ఎందుకీ ట్రాజేడీ? అసలేం జరిగింది? ఆరోగ్య సమస్యలా? మరేదైన కారణం ఉందా? నెల రోజుల వ్యవధిలోనే తల్లి, పిల్లల మృతి స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మృతుల కుటుంబసభ్యుల రక్త నమునాలను హైదరాబాద్‌కు పంపి పరీక్షిస్తున్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ముగ్గురు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మమత కుటుంబ సభ్యులు. గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంగాధరలో ఈ మిస్టరీ మరణాలు చర్చనీయ అంశంగా మారాయి.  బ్లెడ్ శాంపిల్స్ లిస్ట్ వస్తే.. ఈ మరణాల మిస్టరీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..