కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతులు హంగామా సృష్టించాయి. రెండు గంటల పాటు హైరానా పట్టించాయి. జనం భయంతో పరుగులు తీశారు. మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటి కుటుంబసభ్యులు అక్కడి నుండి పరుగు తీశారు.
ఎక్కడి నుంచో వచ్చిన రెండు కోతులు ఇంట్లో చొరబడ్డాయి. అంతే కాకుండా ఇంట్లో చేరి గడియ పెట్టుకున్నాయి. పాపం తిరిగి గడియా తీసుకునేందుకు వాటికి సాధ్యం కాలేదు. తోటి కోతులు ఆపదలో ఉన్నాయని గమనించిన కోతుల గుంపు ఇల్లును చుట్టుముట్టాయి. దీంతో అక్కడ హడావిడి వాతావరణం నెలకొంది. ఇంటి యజమాని స్థానికుల సాయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా భావించిన కోతులు బెదిరించాయి. కర్ర తో కిటికిలో నుండి గడియతీసేందుకు ప్రయత్నించిన స్థానికులు విఫలమయ్యారు. కానీ ప్రయత్నాన్ని సైతం కోతులు అడ్డుకున్నాయి.
దీంతో చివరకు స్థానికులు కట్టర్ సహయంతో ఓ కిటికీని కట్ చేసి తొలగించారు. అవి బయటకు వచ్చేందుకు కొబ్బరి చిప్పలు వేశారు. అయితే బయటకు పంపే ప్రయత్నం చేశారు. అయినప్పటికి అరగంట సమయం తీసుకుని మనుషుల కదలికలు కనపడకపోయేసరికి బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఇంటి యాజమాని ఇంట్లోకి వెళ్లారు. ఇటీవల కోతులు సంఖ్య పెరిగి పోవడంతో స్థానికులు భయపడుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..