వానారానికి సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఓ వానారానికి దెబ్బలు తగిలాయి. కోతుల గుంపు నుంచి వేరు పడిన ఈ కోతి అనారోగ్యంతో బాధపడింది. దీంతో జంతు సంరక్షణ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి కోదాడ నుంచి అంబులెన్స్ గ్రామానికి రప్పించి వానరాన్ని రక్షించే ప్రయత్నం చేశారు స్థానికులు. వానరానికి ఆరోగ్యం క్షీణించడంతో వెటర్నరీ డాక్టర్స్ గ్రామానికి చేరుకొని వానరంకి సెలైన్ బాటిల్ ఎక్కిచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే దెబ్బల నుంచి కోలుకొని వానరం చివరికి మృతి చెందింది. వానరాన్ని ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా గ్రామస్తులు భావించారు. దీంతో ఆ వానరం పై మానవత్వం ప్రదర్శించిన గ్రామస్తులు మనిషి చనిపోతే ఏవిధంగా అంతిమ సంస్కరణలు చేస్తారో అదే తరహాలో వానరానికి దహన సంస్కారాలు చేపట్టారు.
ముందుగా వానరం మృత దేహానికి స్నానం చేయించారు. పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరించారు. పాడె కట్టి అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని పురవీధుల్లో అంతిమయాత్రగా తీసుకెళ్లి గ్రామ శివారులో ఖననం చేశారు. వానరం అంతిమ యాత్రలో ఊరంతా పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..