
బిసిమర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె వీర్రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఓ వానరం వీరరాజు మృతదేహంపై పడి బోరున విలపించింది.. అంతిమ సంస్కారాలు నిర్వహించే వరకు ఆ వానరం.. కుటుంబ సభ్యుడిలా వెంటే నిలిచి నాలుగు కన్నీటి చుక్కలు కార్చింది.
వీర్రాజు తల్లి వెంకటరమణ ఇంటి పక్కన ఉన్న దుర్గమ్మగుడిలో సేవ చేస్తూ ఉండేది.. తల్లితో పాటు వీర్రాజు కూడా ఇదే ఆలయంలో సేవ చేస్తూ వానరానికి నిత్యం ప్రసాదాలు పెట్టేవాడు.. తల్లీకొడుకు పెట్టే ప్రసాదాలు తింటూ ఓ వానరం గుడి పరిసరాల్లోనే సంచరిస్తూ ఉండేది. తాజాగా
వీరరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు మరణవార్త విని ఆ తల్లి మృతదేహంపై పడి తల్లిడిల్లిపోయింది.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వానరం.. మృతుడి కాళ్ళు చేతులు పట్టుకొని, ముక్కు దగ్గర శ్వాస చూస్తూ.. మృతదేహం పై పడి రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టేలా చేసింది.
వీర్రాజు మృతదేహంపై పడి కన్నీళ్లు పెట్టుకున్న వానరం అంతిమయాత్రలో పాల్గొని అంతా అవాక్కయ్యేలా చేసింది. వానరం వీర్రాజు మృతదేహంపై పడి రోధిస్తున్న తీరుపై గ్రామస్తులు ఆశ్చర్య పోయారు..ఈ వానరానికి వీర్రాజుతో ఏ జన్మ బంధమో అంటున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..