Telangana News: మనుషుల్లో రోజు రోజుకు పైశాచికానందం పెచ్చుమీరుతోంది. ఆలోచనల్లో రాక్షసత్వం పీక్స్‌కు చేరుతోంది. ఇలా రాక్షసత్వాన్ని నిదర్శనమైన ఘటన.. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఆ ఘటనను చూస్తే మరీ ఇంత నీచులా అని దుమ్మెత్తిపోస్తారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వానరాన్ని చంపి ప్రధాన రహదారి పక్కనే ఓ చెట్టుకు ఉరివేశారు గుర్తు తెలియని దుండగులు. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రానికి సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఈ దారుణం చోటు చేసుకుంది.
మానతవ్వం చాటుచుకున్న ఎమ్మెల్యే..
అయితే, ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఆ మార్గంలో వెళ్తున్న క్రమంలో ఉరితీసిన వానరాన్ని చూసి చలించిపోయారు. తన కాన్వాయ్‌ని ఆపి.. వానరాన్ని పరిశీలించారు. తన అనుచరులతో కలిసి వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉద్దేశ పూర్వకంగా వానరాన్ని ఉరితీసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే మానత్వానికి ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రజల మనిషి, మానవత్వం ఉన్న ప్రజాప్రతినిథి అంటూ కొనియాడుతున్నారు.
Also read:
Samantha: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత
Samantha- Naga Chaitanya: పచ్చబొట్టు రూపంలో పదిలంగా దాచుకున్న ప్రేమ.. చివరకు ఇలా..