పంటలు పండించాలంటే దుక్కిదున్ని, గుంటుకతో చదును చేసి విత్తనాలు నాటి నీరు పెట్టడం రేతులు సంప్రదాయ పద్ధతి. తరతరాలుగా ఇదే విధాన్ని పాటిస్తున్నారు. కానీ వ్యవసాయంలోనూ సాంకేతికత, ఆధునికీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగితే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. రైతుల్లో సృజనాత్మకత ఆలోచనలు రేకెత్తించి వాటిని అమలు చేసేట్లు ప్రేరేపించి తద్వారా మంచి దిగుబడులు సాధించడలో రైతులకు వెన్నంటి ఉంటున్నారు వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్. పంటలు వేసిన రైతులు దుక్కి దున్నకుండా నేరుగా మొక్కజొన్న విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించడంతో ఎకరాకు రూ.4వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు. ముందస్తుగా విత్తనం నాటు వేయడంతో దిగుబడులు పొందవచ్చని కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామానికి చెందిన రామప్ప అనే యువరైతు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా పంటలు వేయాలని సూచించడంతో ఎక్కవ విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. జీరో టిల్లేజ్ తో పంట ఏపుగా ఎదగడంతో పాటు కంకులు పెద్దగా రావడంతో వారు ఆసక్తి కనబరుస్తున్నారు.
వరి కోత తర్వాత చాలా రోజుల తరబడి దుక్కి దున్నేందుకు భూమిలో తేమ ఎక్కువగా ఉంచేలా నీటి తడి పెట్టి, నేరుగా మొక్కజొన్న విత్తతడంతో తొందరగా పంట వేయడంతో చివరి తడులు నీటి ఎద్దడికి గురికావు. దీంతో దిగుబడులు సైతం అధికంగా ఉండటంతో రైతులకు రెండు విధాలా లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ అధికారి వెల్లడించారు. ఈ పద్ధతిలో పంటలు వేసేందుకు అవగాహన కల్పించడంలో తడ్కల్ క్లస్టర్ పరిధిలోని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read