Agnipath Protest News: సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ (Agnipath scheme)పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్వేస్టేషన్లలో విధ్వంసం చేస్తున్నారు. రైళ్లు, రైలు పట్టాలను తగలబెడుతున్నారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలు తాజాగా సికింద్రాబాద్‌కు పాకాయి. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టేషన్‌లోని పలు రైళ్లకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి కూడా చెందారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని రైళ్లను నిలిపేసింది.
రద్దైన ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలివే..
*లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో ( 8 సర్వీసులు)..
47135, 47138, 47133, 47137, 47140, 47132, 47136, 47139
*హైదరాబాద్- లింగంపల్లి రూట్‌లో ( 9 రైళ్లు)..
47108, 47111, 47110, 47114, 47120, 47109, 47112, 47118. 47119
*ఫలక్‌నుమా- లింగంపల్లి మార్గంలో (12 సర్వీసులు)..
47157, 47160, 47167, 47165, 47216, 47214, 47161, 47207, 47155, 47158, 47156, 47128
*లింగంపల్లి- ఫలక్‌నుమా రూట్‌లో (13 రైళ్లు)..
47181, 47188, 47184, 47189, 47186, 47212, 47182, 47184, 47159, 47179. 47183, 47185, 47217
*ఫలక్‌నుమా- హైదరాబాద్ రూట్‌లో..
47201
*రామచంద్రాపురం- ఫలక్‌నుమా మార్గంలో..
47177
Cancellation of MMTS Train Services today 17.06.2022 @drmhyb @drmsecunderabad pic.twitter.com/s9lWRl4u48
— South Central Railway (@SCRailwayIndia) June 17, 2022
ఇవి కూడా..
వీటితో పాటు చెన్నై, ముంబై నుండి కాజిపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన అన్ని రైళ్లు రద్దయ్యాయి.. ఎలాంటి సమాచారం లేకుండా రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు దిక్కు తోచని స్థితిలో చిక్కుకున్నారు.. మరోవైపు రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు.అదేవిధంగా ఈస్ట్ కోస్ట్, షాలిమార్, హుందానగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైళ్లు ఆగిపోయాయి.మౌలాలి, చర్లపల్లి, ఘట్ కేసర్ స్టేషన్లు లోనూ రైళ్లు నిలిచిపోయాయి. మౌలాలి స్టేషన్లలో 4 ప్లాట్ ఫారంలు, చర్లపల్లి లో 6 ప్లాట్ ఫారంలపై రైళ్లు ఆగిపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..