Kavitha: కార్యకర్తలు కలవకుండా అడ్డుపడుతున్నారు.. తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్..

అధిష్ఠానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడుతున్నారు.. తాను కార్యకర్తలను కలుద్దామనుకున్నా అడ్డంకులు సృష్టించారంటూ కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్‌లో పార్టీ పనితీరుపై నేతలంతా మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలంటూ కవిత కోరారు.

Kavitha: కార్యకర్తలు కలవకుండా అడ్డుపడుతున్నారు.. తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్..
KTR - Kavitha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2024 | 6:41 PM

బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌ కాక రేపాయి. నిజామాబాద్‌ జిల్లాలోని కొందరు పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్‌ అయ్యారు. ముఖ్యంగా.. తాజా మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. అధిష్ఠానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా తానే కార్యకర్తలను కలుద్దామనుకున్నా రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఉద్యమంలో అండగా నిలిచిన నిజామాబాద్‌లో ఓడిపోవడమేంటి?.. అని ప్రశ్నించారు. నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కవిత కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. అధిష్ఠానాన్ని కార్యకర్తలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడుతున్నారు.. తాను కార్యకర్తలను కలుద్దామనుకున్నా అడ్డంకులు సృష్టించారంటూ కవిత ఫైర్ అయ్యారు. నిజామాబాద్‌లో పార్టీ పనితీరుపై నేతలంతా మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిజామాబాద్‌ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలంటూ కవిత కోరారు.

ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌పై రివ్యూ జరిగింది. కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక.. ఎంపీ అభ్యర్థిగా మళ్లీ కవితే ఉంటారా.. లేక కొత్త అభ్యర్థిని పోటీ బరిలో దింపుతారా.. అనేది కూడా ఈ మీటింగ్‌లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే.. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి, కరీంనగర్ క్యాండేట్‌గా వినోద్‌కుమార్‌కి బీఆర్ఎస్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా బీఆర్‌ఎస్ ముందుగానే అలెర్ట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి.. తెలంగాణ ప్రజల్లో తమ స్థానం పదిలంగా ఉందని చాటి చెప్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే.. జనవరి మూడు నుంచి తెలంగాణ భవన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్‌ సమీక్షలు చేస్తోంది. ప్రతిరోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గంపై రివ్యూ చేస్తున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలతో పాటు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.